Begin typing your search above and press return to search.

రూల్స్ రంజన్ బాక్సాఫీస్.. ఇది పరిస్థితి!

గ్రౌండ్ లెవల్ నుంచి షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ టాలీవుడ్ లో హీరోగా ఎదిగిన నటుడిగా రెస్పెక్ట్ ఉంది. అందుకే అతని సినిమాలు వచ్చినపుడు యూత్ ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి చూడటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   10 Oct 2023 4:15 AM GMT
రూల్స్ రంజన్ బాక్సాఫీస్.. ఇది పరిస్థితి!
X

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జోడీగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం రూల్స్ రంజన్. ఎంటర్టైన్మెంట్ లవ్ స్టొరీగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని ఏ విధంగా కూడా మెప్పించలేకపోయింది. వరుస సినిమాలు చేస్తోన్న కిరణ్ అబ్బవరంకి సాలిడ్ సక్సెస్ రావడం లేదు. ఇప్పుడు రూల్స్ రంజన్ కూడా అతని ఖాతాలో మరో డిజాస్టర్ మూవీగా చేరింది.

యూత్ లో ఎంతో కొంత మైలేజ్ కిరణ్ అబ్బవరంకి ఉంది. గ్రౌండ్ లెవల్ నుంచి షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ టాలీవుడ్ లో హీరోగా ఎదిగిన నటుడిగా రెస్పెక్ట్ ఉంది. అందుకే అతని సినిమాలు వచ్చినపుడు యూత్ ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి చూడటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే కిరణ్ అబ్బవరం మాత్రం స్టొరీ సెలక్షన్ విషయంలో ఎందుకనో ప్రేక్షకులని నిరుత్సాహ పరుస్తూనే ఉన్నారు.

ఇప్పుడు రూల్స్ రంజన్ కూడా ప్రేక్షకులని నిరుత్సాహపరిచింది. ఈ సినిమాలో సమ్మోహనుడా సాంగ్ మంచి హిట్ అయ్యింది. దీంతో మూవీకి హైప్ వచ్చింది. అయితే సినిమా సక్సెస్ కి ఆ హైప్ ఉపయోగపడలేదు. ఈ చిత్రం మొదటి, రెండు రోజులు 70 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. ఓ విధంగా చెప్పాలంటే సుదీర్ బాబు మామా మశ్చీంద్ర కంటే మంచి ఓపెనింగ్స్ రూల్స్ రంజన్ కి వచ్చాయి.

ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం 80 లక్షల షేర్ ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 1.15 కోట్ల షేర్ రూల్స్ రంజన్ రాబట్టింది. అయితే 4.50 కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ తో ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చింది. కాని అందులో సగం కూడా వసూలు చేయలేక చతికిలపడింది. కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే కలెక్షన్స్ పరంగా రూల్స్ రంజన్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

మీటర్ మూవీనే పెద్ద డిజాస్టర్ అంటే అంతకు మించి అనే విధంగా రూల్స్ రంజన్ మూవీ ఉండటం గమనార్హం. అయితే కిరణ్ అబ్బవరం చేతిలో మాత్రం సాలిడ్ గానే సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాల స్టొరీల విషయంలో అయిన కాస్తా కేర్ ఫుల్ గా వర్క్ చేసి సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.