Begin typing your search above and press return to search.

రూల్స్ రంజన్.. ఫస్ట్ రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే?

అయితే దర్శకుడు ఈ కథను మొదట కిరణ్ అబ్బవారం కంటే ముందే మరొక హీరోతో చేయాలని అనుకున్నాడు.

By:  Tupaki Desk   |   7 Oct 2023 7:34 AM GMT
రూల్స్ రంజన్.. ఫస్ట్ రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే?
X

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నేహా శెట్టి మెయిన్ హీరోయిన్ గా నటించిన చిత్రం రూల్స్ రంజన్. ఈ సినిమా శుక్రవారం రోజు విడుదలయ్యింది. ప్రముఖ నిర్మాత AM రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ సినిమా కామెడీ లవ్ రొమాంటిక్ యాంగిల్ లో రూపొందించారు. ఇక ఈ సినిమాకు మొదట సాంగ్స్ ద్వారానే మంచి క్రేజ్ లభించింది.

సమ్మోహనుడా అనే పాట లో నేహా శెట్టి గ్లామర్ డోస్ ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. అంతేకాకుండా ట్యూన్ కూడా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. దీంతో సినిమాకు ఆ పాట ద్వారానే ఎక్కువ స్థాయిలో క్రేజ్ అయితే దక్కింది. అయితే దర్శకుడు ఈ కథను మొదట కిరణ్ అబ్బవారం కంటే ముందే మరొక హీరోతో చేయాలని అనుకున్నాడు.

ఆ హీరో మరియు కాదు.. నవీన్ పోలీశెట్టి అని తెలుస్తోంది. నవీన్ జాతి రత్నాలు సినిమాతో మంచి సక్సెస్ అందుకోగానే అందరి ఫోకస్ అతనిపైనే పడింది. ఇక దర్శకుడు జ్యోతి కృష్ణ కూడా నవీన్ బాగుంటాడు అనే అతనిని సంప్రదించారు. అయితే కొన్ని చర్చల అనంతరం ఎందుకో ఈ సినిమా కథ చేయడానికి నవీన్ ఒప్పుకోలేదు. ఇక తర్వాత దర్శకుడు కిరణ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు.

అయితే ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని కిరణ్ ఎంతో నమ్మకంతో కనిపించాడు. ఇక చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ బాగానే చేసింది. కానీ ఊహించిన విధంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చేదు ఫలితాన్ని అందుకున్నట్లు అనిపిస్తోంది. మొదటి రోజే అసలు చాలా ఏరియాలలో ఈ సినిమా థియేటర్స్ ఖాళీగా కనిపించాయి.

కేవలం నేహా శెట్టి గ్లామర్ షో మాత్రమే ఇందులో కాస్త హైలెట్గా నిలిచింది అనే పాజిటివ్ కామెంట్ వచ్చింది. ఇక మిగతా అంశాలలో ఎక్కడా కూడా సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు అని సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వచ్చాయి. అయితే ఈ సినిమా మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద చాలా తక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. మరి శని ఆదివారాల్లో ఈ సినిమాకు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో చూడాలి.