రెడ్ డ్రెస్ హీట్ పెంచిన రుక్మిణీ వసంత్!
ఒకవైపు సినిమాలలో తమ నటనతో ఆకట్టుకుంటూనే మరొకవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను మెప్పించే దిశగా అడుగులు వేస్తున్నారు కొంతమంది హీరోయిన్స్.
By: Tupaki Desk | 3 Feb 2026 10:00 PM ISTఒకవైపు సినిమాలలో తమ నటనతో ఆకట్టుకుంటూనే మరొకవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను మెప్పించే దిశగా అడుగులు వేస్తున్నారు కొంతమంది హీరోయిన్స్. అందులో భాగంగానే ఇప్పుడు సరికొత్త అవుట్ ఫిట్స్ తో ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ఆ దుస్తులలో తమ అందాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు అనడంలో సందేహం లేదు.
అలాంటి వారిలో యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ కూడా ఒకరు. తన అందంతో, నటనతో, హుందాతనంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె ఇటీవల వచ్చిన కాంతార 2 చిత్రంలో నటించి తన నటనతో యావత్ పాన్ ఇండియా రేంజిలో పాపులారిటీ దక్కించుకుంది
ఇందులోని కొన్ని సన్నివేశాలలో హీరో రిషబ్ శెట్టిను కూడా తన నటనతో డామినేట్ చేసి ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. ప్రస్తుతం ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మరికొన్ని చిత్రాలలో బిజీగా ఉన్న రుక్మిణి వసంత్ మరోవైపు ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.
అందులో రెడ్ కలర్ డ్రెస్ ధరించిన ఈమె కుర్చీలో కూర్చొని హుందాగా తన అందాన్ని ఎక్స్ప్లోజ్ చేసింది.. చూపరులకు కనువింపుగా ఉన్న ఈమె అందాన్ని చూసి అభిమానులు కవిత్వాలు వల్లుతున్నారు. ఈమె చూపులు మరింత ప్రకాశవంతంగా అనిపిస్తున్నాయి. తన అవుట్ ఫిట్ తో అభిమానులను మెస్మరైజ్ చేసింది రుక్మిణి వసంత్.
2019లో వచ్చిన కన్నడ చిత్రం బీర్బల్ ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది.2023లో కన్నడ రొమాంటిక్ డ్రామా సప్త సాగర దాచేయెల్లో అనే చిత్రంతో అటు కన్నడ ఇటు తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాకి గాని కన్నడలో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డు లభించింది. ఇక తెలుగులో నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ చిత్రానికి సుధీర్ వర్మ రచనా, దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ద్వారా బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించారు. నిఖిల్ సిద్ధార్థ తో పాటు రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. దాంతో ఈమెకు కూడా గుర్తింపు లభించలేదు.
కానీ ఆ తర్వాత తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా నటించిన మదరాసి సినిమాలో నటించినా.. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదని చెప్పాలి. ఒక కాంతార చాప్టర్ వన్ చిత్రంతో కనకావతి పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాతో పాటు టాక్సిక్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఇంగ్లీష్ , కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ ఉండగా.. వెంకట్ కే నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
