Begin typing your search above and press return to search.

వెనక్కి తగ్గి ట్వీట్‌ డిలీట్ చేసిన వర్మ.. అసలేం జరిగింది?

అలాంటి వర్మ ఒక హీరోయిన్‌ గురించి చేసిన ట్వీట్‌ను తొలగించడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.

By:  Tupaki Desk   |   22 May 2025 4:04 PM IST
వెనక్కి తగ్గి ట్వీట్‌ డిలీట్ చేసిన వర్మ.. అసలేం జరిగింది?
X

రామ్‌ గోపాల్‌ వర్మ చాలా మొండి వాడు, ఆయన ఏదైనా అనుకుంటే పూర్తి చేసి తీరుతాడు, ఏదైన వివాదాస్పద వ్యాఖ్య చేస్తే దానిపై స్టాండ్‌ తీసుకుంటాడు. ఆయన ఎంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా కూడా వాటిని ఆ తర్వాత వెనక్కి తీసుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై గతంలో వర్మ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, వ్యక్తిగత కామెంట్స్ చేశాడు. పవన్‌ కళ్యాణ్‌, లోకేష్‌ పై కూడా వర్మ వివాదాస్పద ట్వీట్స్ చేయడం అందరికీ తెలిసిందే. ఆ ట్వీట్స్ వల్ల వర్మ ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నాడు. అయినా కూడా వాటిని తొలగించేందుకు వర్మ నో చెబుతున్నారు. ఇప్పటికీ ఆయన వాల్‌పై ఆ ట్వీట్స్ ఉన్నాయి.

అలాంటి వర్మ ఒక హీరోయిన్‌ గురించి చేసిన ట్వీట్‌ను తొలగించడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. వార్‌ 2 టీజర్ విడుదల తర్వాత నెట్టింట పెద్ద చర్చ మొదలు అయింది. ఎన్టీఆర్‌ లుక్ విషయంలో, యాక్షన్ సన్నివేశాల విషయంలో ఇంకా చాలా విషయాలను కంపైర్‌ చేస్తూ కొత్తగా ఏం లేదు అంటూ పెదవి విరుస్తూ కామెంట్స్ చేసిన వారు చాలా మంది ఉన్నారు. అదే సమయంలో వర్మ కూడా వార్‌ 2 టీజర్ విషయంలో స్పందించాడు. కియారా అద్వానీ బికినీ ఫోటోను షేర్‌ చేసి అసభ్యకరంగా కామెంట్‌ చేయడం ద్వారా వార్‌ 2 టీజర్‌ను విమర్శించాడు. వార్‌ 2 సినిమా మొత్తం ఇదేనా అన్నట్లుగా ఆయన చేసిన విమర్శ తీవ్ర విమర్శలకు తెర తీసింది.

హీరోయిన్‌ ఫోటోను ఇలా షేర్ చేయడంతో వర్మను ఓ రేంజ్‌లో జనాలు విమర్శించారు. సాధారణంగా వర్మ ఇలాంటి విమర్శలను పెద్దగా పట్టించుకోడు. కానీ ఎందుకు ఆ ట్వీట్‌ను వర్మ డిలీట్‌ చేశాడు. వార్‌ 2 గురించి చేసిన మరో ట్వీట్‌ను అలాగే ఉంచిన వర్మ... కియారా ఫోటోను షేర్ చేసిన ట్వీట్‌ ను మాత్రం డిలీట్‌ చేయడం ద్వారా వివాదానికి ఫుల్‌ స్టాప్ పెట్టాడు. లేడీస్ విషయంలో గొడవలు ఎందుకు అని అనుకున్నాడో లేదంటే, ఆమె తల్లి కాబోతుంది అనే ఉద్దేశంతో ఆమె ఫోటోలను తొలగించాడో తెలియాల్సి ఉంది. వర్మ దేనికి భయపడడు. ట్వీట్‌ను కూడా ఆయన భయపడి డిలీట్‌ చేసి ఉండడు అని, ఎవరైనా అడిగి ఉంటే తీసేసి ఉంటాడు అనేది కొందరి అభిప్రాయం.

రామ్‌ గోపాల్‌ వర్మ చేస్తున్న సోషల్‌ మీడియా హడావిడిపై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హృతిక్ రోషన్‌ కళ్లతో ఎన్టీఆర్‌ కళ్లను పోల్చి చూస్తున్న సమయంలో వర్మ చేసిన కామెంట్‌ను కొందరు యాంటీ ఫ్యాన్స్ తెగ షేర్‌ చేస్తూ ఉండగా, వర్మను ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ వ్యక్తిగతంగా దూషిస్తూ కామెంట్‌ చేస్తున్నారు. వార్‌ 2 సినిమా టీజర్‌ విడుదల తర్వాత అంచనాలు తగ్గాయి అనేది కొందరి మాట. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వార్‌ 2 ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హృతిక్‌ రోషన్‌ గతంలో వార్‌ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. వార్‌ 2 తో ఆ స్థాయి విజయం నమోదు అయినా చాలా గొప్ప విషయం అన్నట్లుగా బాక్సాఫీస్‌ వర్గాల వారు సైతం టీజర్‌పై పెదవి విరుస్తున్నారు.