వార్ 2 టీజర్ గురించి వర్మ ఏమన్నాడు..!
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈమధ్య కాస్త సైలెంట్‌గా ఉన్నాడు అనుకుంటున్న సమయంలో ఏదో ఒక ట్వీట్‌తో హడావిడి చేస్తూనే ఉంటాడు
By: Tupaki Desk | 21 May 2025 12:37 PMవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈమధ్య కాస్త సైలెంట్‌గా ఉన్నాడు అనుకుంటున్న సమయంలో ఏదో ఒక ట్వీట్‌తో హడావిడి చేస్తూనే ఉంటాడు. తాజాగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన 'వార్ 2' సినిమా టీజర్ విడుదల అయింది. ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్ 2 టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్యంగా టీజర్‌లోని ప్రతి షాట్ గతంలోని ఏదో ఒక స్పై థ్రిల్లర్ సినిమాలో చూసినట్లుగా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో కొందరు యాంటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, నెటిజన్స్ కూడా ఎన్టీఆర్ లుక్‌ను ట్రోల్ చేస్తున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ను పోల్చుతూ ట్రోల్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.
ఫ్యాన్స్ మాత్రం వార్ 2 లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపిస్తాడనే విశ్వాసంతో ఉన్నారు. ఎన్టీఆర్ వార్ 2 లుక్ విషయంలో రకరకాలుగా వస్తున్న విమర్శలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇలాంటి సమయంలో ఈ వ్యవహారంలో వర్మ ఎంట్రీ ఇచ్చాడు. ఒక నెటిజన్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కళ్లు మాత్రమే పక్క పక్కన పెట్టి ఈ ఫోటోనే మొత్తం చెప్పేస్తుంది అంటూ ట్రోల్ చేశాడు. సాధారణంగా ట్రోల్స్‌కి సెలబ్రిటీలు రెస్పాండ్ కారు. ఒక హీరోను ట్రోల్ చేస్తూ చేసిన పోస్ట్‌ను ఏ ఒక్కరు షేర్ చేసినా, కనీసం కామెంట్ చేసినా కచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కనుక ట్రోల్స్‌ను సెలబ్రెటీలు చూసి వదిలేస్తారు తప్ప ఇతర హీరోల గురించి కూడా పెద్దగా పట్టించుకోరు.
ఎన్టీఆర్‌ను ట్రోల్ చేస్తూ పెట్టిన ఒక పోస్ట్‌కు మాత్రం వర్మ స్పందించాడు. ఎన్టీఆర్‌ను విమర్శించినట్లుగా క్లీయర్‌గా అర్థం వచ్చే పోస్ట్‌కు వర్మ అవును అంటూ కామెంట్ పెట్టడంతో వివాదం రాజేసినట్లు చేశాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వర్మను ఏకి పారేస్తున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్‌ను ప్రశంసించిన వర్మ ఇప్పుడు వార్ 2 సినిమాలోని లుక్ విషయంలో విమర్శించడం, విమర్శలను నిజమే అంటూ కామెంట్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా నీచంగా వర్మను కామెంట్ చేస్తున్నారు. వార్ 2 లో కియారా అద్వానీ ఉంది కదా... ఆమె బికినీలో తప్ప మరెవ్వరూ టీజర్‌లో వర్మకు కనిపించి ఉండరు, కచ్చితంగా ఆమెను మాత్రమే వర్మ చూసి ఉంటాడు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ లుక్ విషయంలో వర్మ చేసిన ట్రోల్‌కి ఫ్యాన్స్ గట్టి సమాధానం ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున పోస్ట్‌లు పెడుతున్నారు. ఇప్పటికే వర్మను తీవ్రంగా విమర్శిస్తూ కామెంట్ చేసిన వారు, ఆయన పాత పోస్ట్‌లను వెతికి మరీ పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీయడం ఎప్పుడో మరిచి పోయాడు, ఇప్పుడు ఆయన సినిమాలు తీసినా జనాలు పట్టించుకోరు. అందుకే ఇలా బూతులు, విమర్శలు, ట్రోల్ పోస్ట్‌లు చేయడం ద్వారా వార్తల్లో ఉంటాడు అంటూ కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కౌంటర్‌కి వర్మ ఎలా స్పందిస్తాడు, వారి ట్రోల్స్‌ను ఎలా తిప్పి కొడతాడు అనేది చూడాలి.