Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో: సచిన్‌తో చరణ్ 'నాటు నాటు' స్టెప్పులు!

ఈ సందర్భంగా రామ్ చరణ్ క్రికెట్‌ గాడ్ సచిన్‌, బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, తమిళ హీరో సూర్య, హిందీ నటుడు బొమన్ ఇరానీలతో 'నాటు నాటు' పాటకు స్టెప్పులు వేయించారు.

By:  Tupaki Desk   |   6 March 2024 1:14 PM GMT
వైరల్ వీడియో: సచిన్‌తో చరణ్ నాటు నాటు స్టెప్పులు!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల అనంత్‌ అంబానీ రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలలో తాను నటించిన RRR సినిమాలోని సాంగ్ కు ఫ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆస్కార్ కలను సాకారం చేసి పెట్టిన 'నాటు నాటు' పాటకు ఖాన్ త్రయంతో కలిసి కాలు కదిపారు. అయితే ఇప్పుడు ఏకంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో చెర్రీ నాటు నాటు స్టెప్పులు వేయించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రామ్ చరణ్ 'ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌' లో హైదరాబాద్ జట్టుకు యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని థానే వేదికగా తాజాగా ఐఎస్‌పీఎల్‌10 లీగ్ ప్రారంభమైంది. దడోజి కోనదేవ్ స్టేడియంలో ఈరోజు జరిగిన ప్రారంభ వేడుకల్లో చరణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటుగా ప్రముఖ నటులు అక్షయ్‌ కుమార్‌, సూర్య, బొమన్‌ ఇరానీ.. సచిన్‌ టెండూల్కర్‌ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ క్రికెట్‌ గాడ్ సచిన్‌, బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, తమిళ హీరో సూర్య, హిందీ నటుడు బొమన్ ఇరానీలతో 'నాటు నాటు' పాటకు స్టెప్పులు వేయించారు. అలానే స్టేడియంలో చీర్ గర్ల్స్ తో కలిసి అదే నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్ చేసి వారిని ఉత్సాహ పరిచారు. ఆ సమయంలో స్టేడియం మొత్తం మారుమోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాయి.

యంగ్‌ టాలెంట్‌ను వెలికితీసే ఉద్దేశంతో 'ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌' ను నిర్వహిస్తున్నారు. టెన్నిస్ బాల్‏తో నిర్వహించే ఈ లీగ్ కోర్‌ కమిటీ మెంబర్‌గా సచిన్ వ్యవహరిస్తున్నారు. ఇందులో మొత్తం 6 టీమ్స్‌ పాల్గొంటున్నాయి. వీటిలో మజ్‌హీ ముంబై జట్టుకి అమితాబ్‌ బచ్చన్‌, శ్రీనగర్‌ కే వీర్‌ టీమ్ కి అక్షయ్‌ కుమార్‌, బెంగళూరు స్టైకర్స్‌కి హృతిక్‌ రోషన్‌, చెన్నై సింగమ్స్‌ జట్టుకు సూర్య, టైగర్స్‌ ఆఫ్‌ కోల్‌కత్తా టీమ్‌కి సైఫ్‌ అలీ ఖాన్‌ & కరీనా కపూర్‌, ఫాల్కన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌కు రామ్‌ చరణ్ ఓనర్స్‌గా ఉన్నారు.

దాదోజీ కొండదేవ్‌ స్టేడియం వేదికగా మార్చి 6న నుంచి 15వ తేదీ వరకు ఐఎస్‌పీఎల్‌10 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ లీగ్‌లో క్రికెటర్లు వర్సెస్‌ సినిమా హీరోల మధ్య ఆరంభ మ్యాచ్‌ జరగనుంది. ఈ టోర్నీలో రాణించిన గల్లీ ప్లేయర్స్ కు మరిన్ని అవకాశాలు కల్పించడమే ఈ లీగ్‌ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే, RRR తర్వాత మెగా పవర్ స్టార్ రేంజ్, క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరిపోయాయని చెప్పాలి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఇందులో చెర్రీ తొలిసారిగా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. దీని తర్వాత బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో 'RC 16' సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. మార్చి 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా న్యూ ప్రాజెక్ట్స్ అప్డేట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.