Begin typing your search above and press return to search.

రంగం రీ రిలీజ్.. అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

ఇప్పుడు రంగం సినిమాని తెలుగులో రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

By:  Tupaki Desk   |   21 Aug 2023 4:36 AM GMT
రంగం రీ రిలీజ్.. అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..
X

ఈ మధ్య రీరిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ లో జోరుగా సాగుతోంది. ఆరంభంలో స్టార్ హీరోల చిత్రాలు రీరిలీజ్ చేసేవారు. ఫ్యాన్స్ షోల ద్వారా వచ్చే సొమ్ముని సోషల్ యాక్టివిటీస్ కోసం వాడేవారు. ఆ ఫ్యాన్స్ షోల మధ్య కాంపిటేషన్ పెరగడంతో పాత సినిమాలన్నింటిని రీరిలీజ్ చేయడం అలవాటు చేసుకున్నారు. తరువాత ఫ్లాప్ అయిన సినిమాలు కూడా రీరిలీజ్ చేయొచ్చని ఆరెంజ్ మూవీ ప్రూవ్ చేసింది.

ఇప్పుడు ఈ ట్రెండ్ లోకి డబ్బింగ్ సినిమాలు కూడా వచ్చాయి సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీని తెలుగు రాష్ట్రాలలో రీరిలీజ్ చేస్తే మంచి ఆదరణ వచ్చింది. ఇప్పుడు అదే ఊపుతో తమిళ్ సూపర్ హిట్ మూవీ రంగం రీరిలీజ్ చేస్తున్నారు. హీరో జీవా కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ తెలుగునాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పట్లో సినిమాకి 12.2 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో విలన్ గా నటించిన అజ్మల్ కి మంచి ఫేమ్ వచ్చింది.

దీని తర్వాత అదే తరహా పాత్రలని అజ్మల్ ఎక్కువగా చేశారు. ఇప్పుడు రంగం సినిమాని తెలుగులో రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అఫీషియల్ డేట్ అయితే ఎనౌన్స్ చేయలేదు. కానీ డిజిటల్ ఫార్మాట్ లో ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీకి మంచి ఆదరణ లభించడంతో రంగం సినిమాని కూడా మళ్ళీ ప్రేక్షకులకి అందించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా గుడుంబా శంకర్ సినిమాని నాగబాబు రీరిలీజ్ చేస్తున్నారు. దీనికి ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం విశేషం. ఇలా పాత సినిమాలని ఫ్యాన్స్ అభిరుచి మేరకు మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నామని చెబుతున్న వీటి ద్వారా రాబడి బాగుందనే టాక్ వినిపిస్తోంది.

మరి ఈ ట్రెండ్ ఇంకెంత కాలం కొనసాగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రీరీలీజ్ అనేది స్టార్ హీరోల వరకు పరిమితం అయితే ఆడియన్స్ ఎంతో కొంత ఆసక్తి చూపించే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమా రీరిలీజ్ చేస్తే ఆడియన్స్ కి ఆ ఫీల్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది.