సుబ్బరాజ్ టాలీవుడ్ కి వస్తున్నాడా?
ఎనర్జిటిక్ స్టార్ కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడంలో ముందుంటాడు. స్టోరీ నచ్చి అతడిపై నమ్మకం ఉందంటే? ముందుకెళ్లిపోతాడు.
By: Tupaki Desk | 7 May 2025 6:30 PMఎనర్జిటిక్ స్టార్ కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడంలో ముందుంటాడు. స్టోరీ నచ్చి అతడిపై నమ్మకం ఉందంటే? ముందుకెళ్లిపోతాడు. మేకింగ్ సంగతి పక్కన బెడితే రామ్ స్టోరీలను బలంగా నమ్మి వెళ్లి పోతుంటాడు. నచ్చిన స్టోరీలను కొని పెట్టుకోవడం అన్నది అతడికి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. ఇది మంచి అలవాటే అయినా రామ్ అలా చేసిన ప్రయత్నాలేవి పెద్దగా సక్సెస్ అవ్వలేదు. స్టోరీల వైఫల్యం కొన్నై తే..మేకింగ్ కారణంగా ఫెయిలైనవి మరికొన్ని చిత్రాలు.
అలాగే సీనియర్ డైరెక్టర్ల విషయంలోనూ రామ్ అంతే కాన్పిడెంట్ గా ఉంటాడు. బోయపాటి, పూరిలను అలాగే నమ్మి అవకాశం ఇచ్చాడు. మొత్తంగా చూస్తే ప్రస్తుతానికి రామ్ ప్లాప్ ల్లో ఉన్నాడు అన్నది వాస్తవం. ఇప్పటికిప్పుడు ఓ సక్సెస్ పడితే తప్ప పుంజుకోవడం కష్టం. అయినా రామ్ డేరింగ్ ఏమాత్రం తగ్గలేదు అనడానికి 22వ చిత్రమే ఓ ఉదాహరణ. `ర్యాపో` చిత్రాన్ని మహేష్ బాబు. పి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా ఇతడికి పెద్ద ట్రాక్ రికార్డు లేదు.
అనుష్కతో `మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి` లాంటి డీసెంట్ సినిమా తీసాడు. అంతకు ముందు మరో సినిమా చేసాడు. ఈ రెండు సినిమాలు చూసి రామ్ `ర్యాపో` కి అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం ఈసినిమా సెట్స్ లో ఉంది. తాజాగా రామ్ ఇలాకాలో మరో డైరెక్టర్ చేరాడు. అతడే కార్తీక్ సుబ్బరాజ్. ఇటీవలే కార్తీక్ డైరెక్టర్ చేసిన `రెట్రో` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ప్లాప్ అయింది.
అంతకు ముందు రిలీజ్ అయిన `జిగర్తాండ డబుల్ ఎక్స్ ఎల్` కి మంచి పేరొచ్చింది. కానీ కాసులు రాలేదు. ఇంకా ముందు సినిమాల్లోకి వెళ్తే కార్తీక్ సక్సెస్ చాలా దూరంలోనే ఉన్నాడు. `పిజ్జా` తర్వాత సరైన హిట్ ఒకటి పడలేదు. రజనీకాంత్ తో `పేట` లాంటి చిత్రం చేసిన పనవ్వలేదు. తాజాగా కార్తీక్ సుబ్బరాజ్ ...రామ్ కి లైన్ వినిపించాడుట. లైన్ నచ్చడంతో రామ్ పాజిటివ్ గా స్పందించాడుట. మరి ఈ కాంబో సెట్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.