రజినీ 'కూలీ'.. నయా బెంచ్ మార్క్!
ఆగస్టు 14వ తేదీన సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఆ సమయంలో మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్.. వేరే లెవెల్ రెస్పాన్స్ అందుకుంది.
By: Tupaki Desk | 6 April 2025 11:33 AM ISTకోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఏడు పదుల వయసులో కూడా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. యంగ్ హీరోలకు గట్టిపోటీనిస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. నాన్ స్టాప్ గా షూటింగ్స్ లో పాల్గొంటూ తగ్గేదేలే అన్నట్లు ముందుకెళ్తున్నారు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ మూవీ చేస్తున్నారు తలైవా.
గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఆ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జునతోపాటు ఉపేంద్ర, శ్రుతిహాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. రీసెంట్ గా పూర్తైంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఇటీవల సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఆగస్టు 14వ తేదీన సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఆ సమయంలో మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్.. వేరే లెవెల్ రెస్పాన్స్ అందుకుంది. విజిల్ వేస్తున్నట్లు కనిపించిన రజినీ లుక్ చాలా బాగుందనే చెప్పాలి. అయితే అదే డేట్ న జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్2 మూవీ కూడా రిలీజ్ కానుంది. కాబట్టి గట్టి పోటీనే ఉండనుంది.
మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కూలీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ.40 కోట్లకు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ విషయం నెట్టింట వైరల్ గా మారింది. తెలుగు మార్కెట్ లో కూలీ మూవీ కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే కోలీవుడ్ డబ్బింగ్ మూవీకి అంతలా బిజినెస్ జరగడం ఇదే ఫస్ట్ టైమ్.
సౌత్ ఇండియాలో డబ్బింగ్ వెర్షన్ చిత్రాల మార్కెట్ లో కూలీ మూవీ కొత్త రికార్డు సృష్టించినట్లే. సూర్య కంగువ హక్కులు రూ.25 కోట్లకు, దళపతి విజయ్ లియో రైట్స్ రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయి. రజినీ గత మూవీ జైలర్ రైట్స్ రూ.17 కోట్లకు సేల్ అయ్యాయి. కానీ ఇప్పుడు నెవ్వర్ బిఫోర్ అనేలా కూలీ మూవీ బిజినెస్ రూ.40 కోట్లు జరగడం విశేషం.
అయితే ఇప్పటికే కూలీ మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీ దూకుడు.. లోకేష్ టాలెంట్.. భారీ క్యాస్టింగ్.. ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్.. దీంతో మూవీ సూపర్ హిట్ అని అంతా చెబుతున్నారు. తెలుగులో భారీ వసూళ్లు సాధించడం పక్కా అని అంటున్నారు. మరి కూలీ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.