Begin typing your search above and press return to search.

రాజమౌళికి వాంటెడ్‌ హీరో ఎవరో తెలుసా?

అయితే రాజమౌళి మాత్రం తమిళ స్టార్‌ హీరో సూర్య ను డైరెక్ట్‌ చేయాలని కోరుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   15 Sep 2023 2:45 AM GMT
రాజమౌళికి వాంటెడ్‌ హీరో ఎవరో తెలుసా?
X

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ మేటి దర్శకుల జాబితా లో నిలిచాడు. ఇండియన్ సినీ ప్రేక్షకులకు ఆస్కార్ ఆనందాన్ని ఇవ్వడంతో పాటు ఇండియన్ సినిమా కు మొదటి వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి పెట్టిన ఘనత కూడా రాజమౌళికే దక్కింది అనడంలో సందేహం లేదు.

రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు గాను టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతో మంది స్టార్‌ హీరోలు ఆసక్తిగా ఉన్నారు. అయితే రాజమౌళి మాత్రం తమిళ స్టార్‌ హీరో సూర్య ను డైరెక్ట్‌ చేయాలని కోరుకుంటున్నాడు. చాలా కాలం క్రితం నుండే సూర్య ను డైరెక్ట్‌ చేయాలని కోరుకుంటున్నట్లుగా రాజమౌళి పేర్కొన్నాడు.

ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా ను రూపొందించే పనిలో ఉన్న రాజమౌళి భవిష్యత్తులో తప్పకుండా సూర్య తో ఒక సినిమాను చేస్తాను అన్నట్లుగా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇప్పటి వరకు సూర్య కు తగ్గ కథ తనకు తారసపడలేదు అన్నట్లుగా కూడా రాజమౌళి పేర్కొన్నాడు.

భారీ బడ్జెట్‌ తో ఆర్ఆర్‌ఆర్ సినిమాను రూపొందించి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన రాజమౌళి తదుపరి సినిమా తో కూడా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం ఖాయం అన్నట్లుగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఒక విభిన్నమైన అడ్వౌంచర్ కాన్సెప్ట్‌ తో మహేష్ బాబు సినిమా ఉంటుందని సమాచారం అందుతోంది.