Begin typing your search above and press return to search.

గదర్ 2 సెంటిమెంట్ లో పుష్ప 2 - వార్ 2

ఇక మూమెంట్ను చూసుకుని విడుదలయ్యే కొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకుంటూ ఉంటాయి.

By:  Tupaki Desk   |   29 Nov 2023 11:40 AM GMT
గదర్ 2 సెంటిమెంట్ లో పుష్ప 2 - వార్ 2
X

సినిమా ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ కోసం పోటీ ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మరికొన్ని డేట్స్ అయితే సెంటిమెంట్ గా మారిపోతూ ఉంటాయి. ఇక అందులో ముఖ్యంగా సంక్రాంతి అనేది దాదాపు అన్ని ఇండస్ట్రీలకు కూడా ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఇక మూమెంట్ను చూసుకుని విడుదలయ్యే కొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకుంటూ ఉంటాయి.

ఉదాహరణకు ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలైన గదర్ 2 ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఏదో యావరేజ్ టాక్ అందుకుంటుంది అని అనుకున్నారు. అసలే హీరో సన్నీ డియోల్ కు సక్సెస్ వచ్చి ఏళ్ళు గడిచిపోయింది. కాబట్టి ఈ సినిమా ఏం ఆడుతుందిలే అనుకునే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈ సినిమా కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

అయితే రాబోయే రెండేళ్ళలో కూడా ఇండిపెండెన్స్ సెలవులను టార్గెట్ చేస్తూ మరో రెండు కేజీ ప్రాజెక్టులు విడుదల కాబోతున్నాయి. 2024 ఆగస్టు 15న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కూడా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఫస్ట్ పార్ట్ సక్సెస్ కావడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ ను అంతకుమించి అనేలా తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇక ఆగస్టు 15 అంటే తప్పకుండా ఆ వీకెండ్ మొత్తం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 2025లో కూడా ఆగస్టుకు కూడా మరొక బిగ్ బడ్జెట్ సినిమా రాబోతోంది.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం వార్ 2 సినిమాను 2025 ఆగస్టు 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. గదర్ 2 సెంటిమెంట్ తో ఈ రెండు సినిమాలు వచ్చే ఇండిపెండెన్స్ డే సెలవులను టార్గెట్ చేశాయి.

ఇక వార్ 2 సినిమాకు కూడా ఇది బాగా కలిసి వచ్చే డేట్ అని చెప్పవచ్చు. ఇది స్పై కాస్త దేశభక్తి పాయింట్ తో ఉన్న యాక్షన్ సినిమా కాబట్టి ఆ టైంలో పాజిటివ్ టాక్ వస్తే ఒక రేంజ్ లో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి గదర్ 2 సెంటిమెంట్ కు తగ్గట్టుగా ఈ రెండు సినిమాలు సక్సెస్ అవుతాయో లేదో చూడాలి.