Begin typing your search above and press return to search.

హీరోయిన్ల‌ను అడిగేస్తే ఊ అన‌లేదు ఊఊ అన‌లేదు!

అందుకే ఇప్పుడు పుష్ప 2 లో ప్రత్యేక పాట గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   25 Aug 2023 11:30 PM GMT
హీరోయిన్ల‌ను అడిగేస్తే ఊ అన‌లేదు ఊఊ అన‌లేదు!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో అతిపెద్ద చిత్రాల్లో 'పుష్ప 2' ఒకటి. మొద‌టి భాగాన్ని మించి సీక్వెల్ కోసం బ‌న్ని శ్ర‌మిస్తున్నాడు. 2024 లో విడుదల కానున్న ఈ చిత్రానికి ట్రేడ్ లో సాలిడ్ బజ్ ఉంది.

ఇక పుష్ప‌రాజ్ గా బ‌న్ని న‌ట‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన‌ట్టే.. పుష్ప‌లో సమంతా రూత్ ప్రభు ప్రత్యేక గీతానికి ప్ర‌జ‌లు అంతే ఆద‌రించారు. పుష్ప చిత్రాన్ని మ‌రో లెవ‌ల్ కి చేర్చ‌డానికి ఊ అంటావా పాట ఇతోధికంగా సాయం చేసింది. 'ఊ అంటావా మావా..' పాట సమంతకు బాలీవుడ్‌లో చోటు దక్కేలా చేసింది.

అందుకే ఇప్పుడు పుష్ప 2 లో ప్రత్యేక పాట గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇందులో ఒక స్టార్ హీరోయిన్ ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించ‌నుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయ్. ప్ర‌స్తుతం మేకర్స్ హిందీలో ఇద్దరు స్టార్ హీరోయిన్లను సంప్రదించారు.

కానీ వారు ఈ ఆఫ‌ర్ ని తిరస్కరించారు. స‌ద‌రు భామ‌ల్లో ఒక‌రు రెమ్యున‌రేష‌న్ విష‌యంలో వెనక్కి తగ్గారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పుష్ప 2లోని పాటలో అదరగొట్టే స్టార్ ని వెత‌క‌డం కోసం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చాలా ప్ర‌య‌త్నించాల్సి వ‌స్తోంద‌ట‌.

నిజానికి సుకుమార్ చిత్రాలలో ప్రత్యేక పాట‌ల‌కు చాలా ప్రాధాన్య‌త ఉంటుంది. అందులో న‌ర్తించే న‌టీమ‌ణుల‌కు గొప్ప పేరొచ్చేస్తుంది. ప్ర‌తిసారీ సుక్కూ క్రేజీ హిట్ నంబ‌ర్ ల‌ను అందించారు. పుష్ప‌ తర్వాత సీక్వెల్‌లో ఈ స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల‌న్న ఉత్సాహం అభిమానుల్లో ఉంది. అందుకే మేక‌ర్స్ పై ఒత్తిడి చాలా ఎక్కువైంది. మరి ఇంత కీల‌క‌మైన‌ పాటలో అల్లు అర్జున్‌తో ఏ భామ‌ రొమాన్స్ చేస్తుందో చూడాలి.