Begin typing your search above and press return to search.

WAR2 అత‌డి చేరిక‌తో మైండ్ బ్లాక్

గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్‌- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష్ లో భారీ యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్ వార్ 2 చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   24 March 2024 7:21 AM GMT
WAR2 అత‌డి చేరిక‌తో మైండ్ బ్లాక్
X

గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్‌- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష్ లో భారీ యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్ వార్ 2 చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. బ్ర‌హ్మాస్త్ర ఫేం అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మోస్ట్ ఎవైటెడ్ YRF స్పై యూనివర్స్ చిత్రం షూటింగ్ లో ప్ర‌స్తుతం హృతిక్ పాల్గొంటున్నాడు. అత‌డిపై భారీ యాక్షన్ ప్యాక్డ్ ఆరంగేట్ర స‌న్నివేశాన్ని చిత్రీకరించారు. ఇందులో అతడు జపనీస్ ఫైటర్స్‌తో కత్తి యుద్ధంలో పాల్గొన్నారు. ఈ ఫైట్ సినిమాలో ఒక హైలైట్ గా నిలుస్తుంద‌ని స‌మాచారం.

ఈ ఏప్రిల్‌లో హృతిక్ తో జూనియ‌ర్ ఎన్టీఆర్ సెట్స్ లో చేరనున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కోసం తార‌క్ - హృతిక్ దాదాపు 60 రోజుల పాటు షూటింగ్ కోసం కేటాయించారని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. ఇప్పుడు వార్ 2 మ్యూజిక్ ఆల్బమ్ చేయడానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆదిత్య చోప్రా - అయాన్ ముఖర్జీ పాపుల‌ర్ ట్యాలెంట్ ప్రీతమ్‌ను ఎంచుకున్నారని తెలుస్తోంది.

అయాన్ ముఖ‌ర్జీ గ‌తంలో ఆదిత్య చోప్రాతో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ల కోసం క‌లిసి పని చేసారు. వేక్ అప్ సిద్, యే జవానీ హై దీవానీ, బ్రహ్మాస్త్రా లాంటి క్రేజీ చిత్రాల్ని వైఆర్.ఎఫ్‌లో తెరకెక్కించారు. వీరిద్దరూ ఇప్పుడు వార్ 2 కోసం మళ్లీ కలుస్తున్నారు. ప్రీతమ్ కూడా ఆదిత్య చోప్రాతో కలిసి ధూమ్, ధూమ్ 2, న్యూయార్క్, బద్మాష్ కంపెనీ, ధూమ్ 3 ల‌కు ప‌ని చేసారు. ఇటీవలి టైగర్ 3 స‌హా చాలా ప్రాజెక్ట్‌లకు క‌లిసి పనిచేశారు.. ఆది- అయాన్‌ల బృందం ప్రీతమ్‌తో గొప్ప అనుబంధాన్ని కలిగి ఉన్నారు. వార్ 2 కోసం క‌లిసి ప‌ని చేసేందుకు వారంతా ఉత్సాహంగా ఉన్నారని క‌థ‌నాలొస్తున్నాయి.

ఆసక్తికరంగా వార్ 2 హృతిక్ - ప్రీతమ్‌ల రెండవ క‌ల‌యిక‌. ఎందుకంటే వీరిద్దరూ గతంలో ధూమ్ 2 కోసం కలిసి పనిచేశారు. ఈ చిత్రం వైఆర్‌ఎఫ్ నిర్మించిన సీక్వెల్ కూడా. ఇది ప్రీతమ్ - ఎన్టీఆర్ జూనియర్‌లకు మొదటి క‌ల‌యిక‌. వార్ 2 లాంటి క్రేజీ ప్రాజెక్టుకు సంగీతాన్ని అందించే అవ‌కాశం వ‌చ్చినందుకు ప్రీతమ్ కూడా ఆనందాన్ని వ్య‌క్తం చేసాడు. ఎందుకంటే భారతీయ సినీ ప‌రిశ్ర‌మ‌లోని ఇద్దరు అత్యుత్తమ నృత్యకారులైన హృతిక్ రోషన్- ఎన్టీఆర్ జూనియర్‌లపై చిత్రీకరించాల్సిన పాటలను కంపోజ్ చేయాలనే ఆలోచన అత‌డికి ఇప్ప‌టికే ఉంది. వార్ 2 బృందం YRF స్పై యూనివర్స్ లో మ‌రో రేంజును ఆవిష్క‌రించడానికి అన్ని ప్రయత్నాలను చేస్తోంది. కంటెంట్, స్కేల్, యాక్షన్, స్టోరీ టెల్లింగ్, సంగీతం ఇలా అన్ని విభాగాల్లో వార్ 2 ని ట్రెండ్ సెట్ట‌ర్ గా నిల‌పాల‌ని య‌ష్ రాజ్ ఫిలింస్ ప్ర‌య‌త్నిస్తోంది.

వార్ 2 కోసం నార్త్ - సౌత్‌కు చెందిన ఇద్దరు పెద్ద సూపర్‌స్టార్‌లను ఒకచోట చేర్చ‌డంలో ప‌క్కా బిజినెస్ ఎత్తుగ‌డ ఉంది. ఈ క‌ల‌యిక‌తో నిజమైన పాన్-ఇండియా చిత్రంగా ఇది రూపాంత‌రం చెందింది. ఈ ఏడాది చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి, 14 ఆగస్ట్ 2025న రిలీజ్ చేయాల‌నేది ప్లాన్. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 తర్వాత YRF స్పై యూనివర్స్‌కి ఇది ఆరవ చిత్రం. దీని తర్వాత అలియా భట్ - శర్వారితో మహిళా గూఢచారి చిత్రం ఈ యూనివ‌ర్శ్ లో రూపొందిస్తారు. త‌దుప‌రి షారుఖ్ ఖాన్‌తో పఠాన్ 2 సెట్స్ కెళుతుంది. చివ‌రిగా టైగ‌ర్ వ‌ర్సెస్ పఠాన్ ని కూడా చిత్రీక‌రిస్తారు.