Begin typing your search above and press return to search.

ప్రభాస్ vs తారక్.. నీల్ టెన్షన్ ఏడాదైనా తీరదేమో?

మాస్ హై వోల్టేజ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ఏ సినిమా స్టార్ట్ చేస్తాడు అనే విషయంలో అయితే కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది

By:  Tupaki Desk   |   8 May 2024 4:30 PM GMT
ప్రభాస్ vs తారక్.. నీల్ టెన్షన్ ఏడాదైనా తీరదేమో?
X

మాస్ హై వోల్టేజ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ఏ సినిమా స్టార్ట్ చేస్తాడు అనే విషయంలో అయితే కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. మొదట అయితే అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రభాస్ తో సలార్ సెకండ్ పార్ట్ ను వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోతున్నట్లుగా లేటెస్ట్ గా ఒక టాక్ వైరల్ గా మారుతోంది.

ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్ మరోవైపు ఎన్టీఆర్ తో చేయాల్సిన ప్రాజెక్టును కూడా ఇప్పుడే మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత నెల రోజులుగా ఈ విషయంలో ఇరువర్గాల ఫ్యాన్స్ కు అయితే కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. కానీ అప్పుడప్పుడు సలార్ 2లో నటించిన యాక్టర్స్ మాత్రం షూటింగ్ స్టార్ట్ కాబోతోంది అని సినిమాను తొందరగా రిలీజ్ చేస్తారని కూడా చెప్పారు.

దీంతో ఓ వర్గం ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇది నిజమని ఎన్ని గాసిప్స్ వచ్చినా కూడా పట్టించుకోలేదు. ఇక రీసెంట్ గానే దర్శకుడు ప్రశాంత్ ప్రత్యేకంగా ఎన్టీఆర్ ను కలిసినట్లుగా కూడా కొన్ని రూమర్స్ అయితే పుట్టుకొచ్చాయి. మైత్రి సంస్థ తోనే ఈ సినిమా రానుంది. ఒక విధంగా నీల్ ఈ ఇద్దరి హీరోల మధ్యలో కాస్త టెన్షన్ పడుతున్నట్లే అనిపిస్తోంది. ఇద్దరు బిజిగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం ప్రభాస్ వల్లనే అతని తదుపరి ప్రాజెక్టు పై కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ కల్కి సినిమా షూటింగ్ అయితే ఫినిష్ చేశాడు. ఇక ప్రమోషన్స్ లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అలాగే రాజా సాబ్ సినిమా షూటింగ్ కూడా పూర్తవ్వాల్సి ఉంది. ఇక హను దర్శకత్వంలో కూడా మరొక సినిమాను ఇదే ఏడాదిలో మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లిస్టులో సందీప్ రెడ్డి వంగా సినిమా కూడా ఉంది. అది స్టార్ట్ అవ్వడానికి కాస్త సమయం పట్టవచ్చు.

ఈ క్రమంలో ప్రభాస్ డేట్స్ తీసుకుని సలార్ 2ని తొందరగా ఫినిష్ చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. వచ్చే ఏడాది అయినా కాస్త డౌట్ అనే చెప్పాలి. ఇక ప్రశాంత్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ విషయానికి వస్తే మరో రెండు మూడు నెలల్లో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మొదటి భాగాన్ని ఫినిష్ చేయబోతున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

వార్ 2 సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు కానీ దాని కోసం ఎక్కువ టైమ్ తీసుకునే ఛాన్స్ ఉండదు. కాబట్టి నీల్ సినిమాకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ దేవర ప్రమోషన్స్, వార్ 2 హడావుడి పూర్తయ్యే సరికి నీల్ ప్రాజెక్టు కథ 2025కి షిఫ్ట్ అవుతుంది. ఆ లోపు స్క్రిప్ట్ పకడ్బందీగా రెడీ చేసుకొని షూటింగ్ మొదలెట్టినా కూడా సినిమా రావడానికి ఏడాది కంటే ఎక్కువ టైమ్ పడుతుంది. ఇక సలార్ 2ని 2026 లో స్టార్ట్ చేసే అదే వైబ్ ఉంటుందా లేదో తెలియాలి అంటే కాలమే సమాధానం ఇవ్వాలి.