ఎల్2లో మోహన్ లాల్ యంగ్ పాత్ర చేసింది మరెవరో కాదు...
ఎంపురాన్ క్లైమాక్స్ లో ఎల్3: ది బిగినింగ్ అంటూ టైటిల్ పడే ముందు వచ్చే సీన్ లో స్టీఫెన్ గట్టుపల్లి యంగ్ లైఫ్ గురించి చిన్న టీజర్ ను చూపించారు.
By: Tupaki Desk | 2 April 2025 11:49 AMమోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎల్2: ఎంపురాన్. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ దీని చుట్టూ వివాదాలు ఎక్కువైపోయాయి. ఎల్2: ఎంపురాన్ మూవీ అత్యంత వేగంగా రూ.200 కోట్లు వసూలు చేసిన మలయాళ చిత్రంగా రికార్డు కూడా సృష్టించింది.
ఈ వీకెండ్ కు మల్లూవుడ్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఎంపురాన్ చరిత్ర సృష్టించే ఛాన్సుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మోహన్ లాల్ యంగ్ క్యారెక్టర్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడారని వార్తలు బాగా వినిపించాయి. ఎంపురాన్ క్లైమాక్స్ లో ఎల్3: ది బిగినింగ్ అంటూ టైటిల్ పడే ముందు వచ్చే సీన్ లో స్టీఫెన్ గట్టుపల్లి యంగ్ లైఫ్ గురించి చిన్న టీజర్ ను చూపించారు.
ఆ ఫైట్ సీన్ లో యంగ్ మోహన్ లాల్ గా నటించిందెవరనేది చాలా మందికి అర్థం కాలేదు. దీంతో అది మోహన్ లాల్ ఫేసే అని కాకపోతే ఆయన్నే ఏఐలో యంగ్ గా చూపించారనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ వార్తలకు ఎల్2 డైరెక్టర్ పృథ్వీరాజ్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి చెక్ పెట్టారు. ఎల్2లో యంగ్ మోహన్‌లాల్ గా నటించింది మరెవరో కాదని, మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ అని పృథ్వీరాజ్ ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు.
అంటే ఎల్3: ది బిగినింగ్ లో మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ కనిపించబోతున్నాడన్న మాట. ఆల్రెడీ సినిమాల్లోకి వచ్చి తనదైన గుర్తింపు తెచ్చుకున్న ప్రణవ్ హృదయం లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. గతేడాది ప్రణవ్ వర్షంగల్కు శేషం సినిమాతో మరో హిట్ సాధించాడు. దీంతో ఎల్2 మూవీలో మోహన్ లాల్ యంగ్ పాత్ర కోసం ఎలాంటి ఏఐను వాడలేదని క్లారిటీ వచ్చేసింది.
ఇక ఈ సినిమా వివాదాల విషయానికొస్తే ఆల్రెడీ వాటిపై చిత్ర యూనిట్ రెస్పాండ్ అయి కొన్ని చర్యలు కూడా తీసుకుంది. సినిమాలో కొన్ని మార్పులు చేసి మరోసారి సెన్సార్ ను ఆశ్రయించింది. ఎల్2లో కావాలని ఒక మతాన్ని కించపరిచేలా ఇందులో సీన్స్ పెట్టారంటూ కోర్టులో కేసులు కూడా నమోదయ్యాయి. ఎన్ని వివాదాలున్నప్పటికీ ఎల్2 సినిమాకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు.