Begin typing your search above and press return to search.

సలార్ 2.. ఈ ప్లాన్ లో ఏ మార్పు లేదు!

ప్రభాస్ నెక్స్ట్ కల్కి సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో సక్సెస్ అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు

By:  Tupaki Desk   |   30 April 2024 11:30 PM GMT
సలార్ 2.. ఈ ప్లాన్ లో ఏ మార్పు లేదు!
X

ప్రభాస్ నెక్స్ట్ కల్కి సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో సక్సెస్ అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ హడావిడి కూడా మొదలైపోయింది. మొత్తానికి విడుదల డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చేశారు. జూన్లో పక్క ప్రణాళికతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - ప్రభాస్ సలార్ సీక్వెల్ ను కూడా వీలైనంత తొందరగా స్టార్ట్ చేయబోతున్నట్లు గతంలోనే ఒక క్లారిటీ వచ్చేసింది. సినిమాలో నటించిన చాలామంది కూడా ఏప్రిల్ లోనే సినిమా స్టార్ట్ అయిపోతుంది అన్నట్లుగా మాట్లాడారు. కానీ దర్శకుడు ప్రశాంత్ మాత్రం ఆ విషయంలో పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే ప్రభాస్ కల్కి సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇచ్చి ఆ సినిమా విడుదల వరకు ప్రమోషన్స్ లో బిజీగా ఉంటాడు.

అందుకే ప్రశాంత్ నీల్ కూడా సలార్ 2 పనులు స్టార్ట్ అయితే చేయలేదు. దీంతో ఈ విషయంపై చాలా రకాల గాసిప్స్ అయితే పుట్టుకొచ్చాయి. ప్రశాంత్ ప్రభాస్ కోసం ఎదురు చూడకుండా ముందుగా ఎన్టీఆర్ సినిమాను పట్టాలు ఎక్కించే అవకాశం ఉందని కూడా కొన్ని కథనాలు వెలువడ్డాయి. ప్రభాస్ కల్కి తర్వాత రాజా సాబ్, హను రాఘవపూడి సినిమాలతో బిజీ అయ్యే అవకాశం ఉంది అని అందుకే ఈ లోపు ఎన్టీఆర్ సినిమాను మొదలు పెట్టవచ్చని వివిధ రకాల రూమర్స్ అయితే వచ్చాయి.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రాజెక్టు మొదలవ్వాలి అంటే ముందు ఎన్టీఆర్ డేట్స్ దొరకాలి. ప్రస్తుతం బాలీవుడ్ వార్ ప్రాజెక్టులో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత మళ్ళీ దేవర షూటింగ్ కు ఫీనిషింగ్ టచ్ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి అతను ఇప్పట్లో దొరికే అవకాశం లేదు.

అంతేకాకుండా సలార్ 2 కూడా వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందు తేవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఆలస్యం చేస్తే బజ్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సలార్ 2 సినిమాను కల్కి వచ్చిన తర్వాత వెంటనే మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కల్కి రిలీజ్ అనంతరం ఒక ఐదు రోజులపాటు రెస్ట్ తీసుకోబోతున్న ప్రభాస్ సలార్ 2 ప్రాజెక్టును సెప్టెంబర్ మొదట్లోనే స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు మొదటి షెడ్యూల్ కు సంబంధించిన ప్రణాళికను కూడా రచించాడని సమాచారం.