Begin typing your search above and press return to search.

ప్రభాస్.. అసలు విషయమిది!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ ఇన్ స్టా స్టోరీ.. ఎంతటి వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 May 2024 3:36 AM GMT
ప్రభాస్.. అసలు విషయమిది!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ ఇన్ స్టా స్టోరీ.. ఎంతటి వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. 'త్వరలో మన జీవితంలోకి ఓ ప్రత్యేకమైన వాళ్లు వస్తున్నారు.. వెయిట్ చేయండి' అంటూ ప్రభాస్ ఈరోజు మార్నింగ్ పోస్ట్ పెట్టారు. దీంతో ఆ పోస్ట్ ఆయన పెళ్లి గురించి అయి ఉంటుందని చాలా మంది భావించారు. దీంతో నెట్టింట రకరకాల ఊహాగానాలు వినిపించాయి. మార్నింగ్ నుంచి ప్రభాస్ ఇన్ స్టా స్టోరీ కోసమే ఎక్కడ చూసినా చర్చ నడిచింది.

అయితే ఇదంతా ఆయన నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ ప్రమోషన్స్ లో భాగమేనని మరికొందరు ఊహించారు. ఇప్పుడు వారి ఊహలే నిజమయ్యాయి. మార్నింగ్ ఇన్ స్టా స్టోరీకి వచ్చిన పెళ్లి వార్తలన్నీ తూచ్ అనేలా తాజాగా మరో స్టోరీ పెట్టారు ప్రభాస్. డార్లింగ్స్.. బుజ్జిని మీకు చూపించడానికి ఉత్సాహంగా ఉన్నట్లు పోస్టర్ షేర్ చేశారు. అలా తన పెళ్లికి ఎలాంటి సంబంధం లేకుండా కల్కి ప్రమోషన్స్ ను వినూత్నంగా ప్రారంభించారు.

స్క్రాచ్ ఎపిసోడ్- 04 శనివారం (మే 18) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. దీంతో ఆ బుజ్జి ఎవరనేది ఇప్పుడు చర్చ మొదలైంది. అయితే ఏడాది క్రితం కల్కి మేకర్స్.. స్క్రాచ్ పేరుతో కొన్ని వీడియోలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో ఓ స్పెషల్ కారును తయారు చేస్తున్నట్లు చూపించారు. ఆ కారునే ముద్దుగా ప్రభాస్ బుజ్జి అని పిలుస్తున్నారు. దాని ఫ్యాన్స్ కు చూపించేందుకు ఇప్పుడు ఆసక్తిగా ఉన్నారు.

అయితే కల్కి 2898 ఏడీ మూవీ కోసం ఎన్నో రకాల వాహనాలను తాము తయారు చేసినట్లు ఇప్పటికే డైరెక్టర్ నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఈ మూవీలో కనిపించే వాహనాలు, వస్తువులు ఎన్నడూ చూడని విధంగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంతో ప్రేక్షకులను నాగ్ అశ్విన్ ఫ్యూచర్ లోకి తీసుకెళ్లనున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అందుకే వాహనాలు కూడా భవిష్యత్ పరిస్థితులను అంచనా వేసి డిజైన్ చేసినట్లు సమాచారం.

మొత్తానికి ప్రభాస్ చెప్పినట్లు.. మన జీవితాల్లోకి రాబోతున్న ఆ ప్రత్యేకమైన వ్యక్తి బుజ్జి అనే కారు అని తేలిపోయింది. మరి ఆ కారు ఎలా ఉండబోతుందో మరికొన్ని గంటల్లో తేలనుంది. దీంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోస్టర్ కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కల్కి సినిమా జూన్ 27వ తేదీన విడుదల కానుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.