పిక్‌టాక్ : అమ్మమ్మ చీరలో అందాల పూజా
ఇటీవల పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. చీర కట్టులో పూజా హెగ్డే లుక్‌కి మంచి రెస్పాన్స్ దక్కింది.
By: Tupaki Desk | 28 April 2025 10:37 AM ISTతమిళ్ మూవీ 'ముగమూడి'తో 2012లో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఆ సినిమా నిరాశపరచిన నటిగా గుర్తింపు తెచ్చి పెట్టింది. తెలుగులో ఈమె 2014లో ఒక లైలా కోసం, ముకుందా సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ విజయాలను అందుకోవడంలో విఫలం అయ్యాయి. అయినా కూడా నిరాశ పడకుండా సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. 2010 మిస్ యూనివర్స్ ఇండియా అందాల పోటీల్లో రెండవ రన్నరప్‌గా నిలవడంతో సినిమా ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు దక్కాయి. తెలుగులో ఈమె అత్యధిక యంగ్ స్టార్ హీరోలతో సనిమాలు చేసిన ఘనత దక్కించుకుంది.
ఈమధ్య కాలంలో టాలీవుడ్‌లో పూజా హెగ్డేకి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. ఒకానొక సమయంలో ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఏడాది గ్యాప్ తర్వాత కోలీవుడ్‌లో బిజీ అయింది. ప్రస్తుతం ఈమె హిందీతో పాటు, తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తోంది. ఈమె నటించిన తాజా చిత్రం 'రెట్రో' విడుదలకు సిద్ధం అయింది. తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో సినిమాను మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. రెట్రో సినిమా ప్రమోషన్‌లో భాగంగా రెట్రో లుక్‌తో పూజా హెగ్డే అలరిస్తోంది. ఇటీవల పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. చీర కట్టులో పూజా హెగ్డే లుక్‌కి మంచి రెస్పాన్స్ దక్కింది.
70 ఏళ్ల క్రితం చీర అంటూ తన అమ్మమ్మ చీరను పూజా హెగ్డే కట్టుకుని ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో వింటేజ్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందుకే పూజా హెగ్డే కూడా తన అందమైన వింటేజ్ లుక్‌ను షేర్ చేసింది. తన అమ్మమ్మ చీరును ధరించడంతో పాటు, ఈతరం అమ్మాయిల మాధిరిగా స్టైలిష్ మేకోవర్‌తో సింపుల్ హెయిర్ స్టైల్‌తో చూపు తిప్పుకోనివ్వకుండా అందంగా ఉంది. చీర కట్టుకు తగ్గట్లుగా సిగ్గు పడుతూ, అందంగా పూజా హెగ్డే ఈ ఫోటోల్లో కనిపిస్తుంది. అందమైన పాత చీరకు తోడు, విభిన్నమైన బ్లౌజ్‌ను పూజా హెగ్డే ధరించడం ద్వారా అందరి చూపు తన వైపు తిప్పుకుంది. ఇంత అందంగా ఉన్న పూజా హెగ్డే టాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి నటించిన డీజే, అల వైకుంఠపురంలో సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న ఈమె ఎన్టీఆర్‌తో అరవింద సమేత సినిమలో నటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈమె రెట్రో సినిమాతో పాటు రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలోని ఐటెం సాంగ్‌తో కనిపించబోతుంది. ఇక విజయ్ హీరోగా నటిస్తున్న చివరి మూవీ జన నాయగన్ లోనూ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న కాంచన ప్రాంచైజీ మూవీ కాంచన 4లో పూజా హెగ్డే నటిస్తోంది. నాలుగు తమిళ్ సినిమాలు, ఒక హిందీ సినిమా చేస్తున్న ఈమె త్వరలోనే తెలుగులోనూ రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
