పూజా ఫ్యాన్స్ ని వాటితో సరిపెడుతుందా..?
అలాంటిది తన ఫ్యాన్స్ తనను మిస్ అవుతున్నారన్న భావన అమ్మడిలో కూడా ఉంది. అందుకే పూజా హెగ్దే తన ప్రతి అప్డేట్ ని సోషల్ మీడియాలో ఉంచుతుంది.
By: Tupaki Desk | 2 July 2025 8:30 AM ISTబుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో పూర్తిగా ఖాళీ అయ్యింది. మహేష్ బాబు గుంటూరు కారం నుంచి బయటకు వెళ్లడమే ఆమె చేసిన పొరపాటు అన్నట్టుగా ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా అమ్మడికి రాలేదు. పూజా హెగ్దేకి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మడి గ్లామర్ షోకి ఇక్కడ ఆడియన్స్ ఫిదా అయిపోతారు. అలాంటిది తన ఫ్యాన్స్ తనను మిస్ అవుతున్నారన్న భావన అమ్మడిలో కూడా ఉంది. అందుకే పూజా హెగ్దే తన ప్రతి అప్డేట్ ని సోషల్ మీడియాలో ఉంచుతుంది.
ముఖ్యంగా ఇన్ స్టా ఫోటో షూట్స్ వల్ల పూజా హెగ్దే ఎక్కువమంది ఆడియన్స్ కు రీచ్ అవుతుంది. బాలీవుడ్ లో అమ్మడు క్లిక్ అవ్వకపోయినా సౌత్ సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమాలు ఆమెకు స్టార్ డం తెచ్చి పెట్టాయి. టాలీవుడ్ లో స్టార్ సినిమాలు చేసిన పూజా హెగ్దే ఇక్కడ సూపర్ పాపులారిటీ సంపాధించింది. ఐతే సడెన్ గా ఆమెకు తెలుగులో కూడా అవకాశాలు రావడం ఆగిపోయాయి. దీని వెనక రీజన్ ఏదైనా సరే టాలీవుడ్ పై పూజా పెట్టుకున్న ఆశలనీ ఆవిరి అయ్యాయి.
ఈమధ్యనే సూర్య సరసన రెట్రో చేసిన పూజా హెగ్దే ఆ సినిమా తనకు మంచి కంబ్యాక్ ఇస్తుందని ఆశించింది. కానీ ఆమెను ఎక్కువా కాదు కాదు పూర్తిగా ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ లో చూసిన వాళ్లు సడెన్ గా డీ గ్లామర్ రోల్ అనేసరికి కాస్త షాక్ అయ్యారు. ఐతే ఆ సినిమా వల్ల పూజాకి యాడ్ అయ్యింది అయితే ఏమి లేదని చెప్పొచ్చు.
రెట్రో ప్రమోషన్స్ లోనే తెలుగు నుంచి ఒక ఆఫర్ వచ్చిందని అది త్వరలో తెలుస్తుందని వెల్లడించిన పూజా హెగ్దే చూస్తుంటే ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా బయటకు వెళ్లినట్టు తెలుస్తుంది. అందుకే సినిమాల అవకాశాలు వచ్చే వరకు ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది అమ్మడు. తెలుగులో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది కాబట్టి కొద్దిగా ప్రయత్నించి ఒక్క పాన్ ఇండియా ఛాన్స్ అందుకుంటే మళ్లీ కెరీర్ సెట్ రైట్ అవుతుందనే ఆలోచనలో ఉన్నట్టుంది పూజా హెగ్దే. అందుకే తెలుగు ఛాన్స్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తుంది. మరి ఆ ఛాన్స్ ఇచ్చేది ఎవరన్నది చూడాలి.
