Begin typing your search above and press return to search.

పూజా అది కూడా క‌వ‌ర్ చేస్తుందా?

2023 ముందు వ‌ర‌కు పూజా హెగ్డే తెలుగులో స్టార్ హీరోయిన్. కానీ ఆ త‌ర్వాత అమ్మ‌డు నుంచి ఒక్క సినిమా కూడా వ‌చ్చింది లేదు.

By:  Tupaki Desk   |   20 April 2025 1:55 PM IST
Pooja Hegdes Return to Telugu Cinema and New Projects in the South
X

2023 ముందు వ‌ర‌కు పూజా హెగ్డే తెలుగులో స్టార్ హీరోయిన్. కానీ ఆ త‌ర్వాత అమ్మ‌డు నుంచి ఒక్క సినిమా కూడా వ‌చ్చింది లేదు. వ‌రుస ఫ్లాపుల‌తో పాటూ, ఆ టైమ్ లో పూజా క‌న్ను బాలీవుడ్ పై ఉండ‌టం వ‌ల్ల ఇక్క‌డ ఫోక‌స్ చేయ‌లేదు. దీంతో తెలుగులో ఆఫ‌ర్లు త‌గ్గిపోయాయి. రీజైన్స్ ఏవైనా కానీ దాదాపు మూడేళ్లు పూజా టాలీవుడ్ కు దూర‌మైంది.

మూడేళ్లు సౌత్ లో గ్యాప్ తీసుకున్న పూజా కెరీర్ ఇప్పుడు కొత్త మ‌లుపు తిరిగింది. పూజా హీరోయిన్ గా సూర్య తో చేసిన రెట్రో సినిమా మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ప‌లు భాష‌ల్లో రిలీజ‌వుతుంది. ఎప్ప‌టిలాగా గ్లామ‌ర్ రోల్ లో కాకుండా ఈసారి పూజా డీ గ్లామ‌ర్ రోల్ లో క‌నిపించ‌నుంద‌ని రెట్రో పోస్ట‌ర్లు, టీజ‌ర్, ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది.

రెట్రో సినిమా ఎలా ఉన్నా ఆ సినిమాలో పూజా పాత్ర‌కు మంచి గుర్తింపు వ‌స్తుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలంటున్నాయి. రెట్రోతో పాటూ పూజా త‌మిళంలో జ‌న‌నాయ‌గ‌న్ లో విజ‌య్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ర‌జినీకాంత్, లోకేష్ కన‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న కూలీలో పూజా స్పెష‌ల్ సాంగ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. వీటితో పాటూ తెలుగులో రీసెంట్ గా ఓ ల‌వ్ స్టోరీకి సైన్ చేసిన విష‌యాన్ని కూడా పూజా అనౌన్స్ చేసింది.

హీరో, డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది చెప్ప‌లేదు కానీ తెలుగులో సినిమా చేస్తున్న విష‌యాన్ని మాత్రం పూజా బ‌య‌ట‌కు చెప్పింది. పూజా తెలుగు సినిమాకు సైన్ చేయ‌డంపై ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు పూజా కిచ్చా సుదీప్ తో ఓ సినిమా చేయ‌బోతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అనూప్ భండారీ ద‌ర్శ‌క‌త్వంలో సుదీప్ చేయ‌బోతున్న బిల్లా రంగా బాషా అనే సినిమాలో పూజా హెగ్డే న‌టించ‌బోతుంద‌ని వార్త‌లు జోరుగా వ‌స్తున్నాయి.

హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ గా రూపొంద‌నున్న ఈ సినిమాలో పూజా న‌టిస్తే ఇదే త‌న క‌న్న‌డ డెబ్యూ సినిమా అవుతుంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజా ఇప్పుడు క‌న్న‌డ లో కూడా ఎంట్రీ ఇచ్చేస్తే సౌత్ మొత్తాన్ని క‌వ‌ర్ చేసిన‌ట్టు అవుతుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది లేదు.