నా డ్రీమ్ కో స్టార్ అతనే!
హీరోయిన్లు అందరూ ఈ మధ్య తాము వర్క్ చేయాలనుకునే కో స్టార్ల గురించి చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు.
By: Tupaki Desk | 21 April 2025 8:00 PM ISTహీరోయిన్లు అందరూ ఈ మధ్య తాము వర్క్ చేయాలనుకునే కో స్టార్ల గురించి చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా తన మనసులోని విషయాన్ని బయటపెట్టింది. తన సహజ నటనతో అందరినీ మెప్పించి, పక్కింటి అబ్బాయిలా అనిపించే హీరోతో తాను వర్క్ చేయాలనుకుంటున్నట్లు పూజా తెలిపింది.
ఆ హీరో ఎవరో ఈ పాటికే అర్థమై ఉండాలి. పూజా నటించిన రెట్రో సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఆ సినిమా ప్రమోషన్స్ లో పూజా చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పూజా తనకు నానితో కలిసి వర్క్ చేయాలనుందని, తన డ్రీమ్ కో స్టార్ నానినే అని తెలిపింది. వీరి కాంబినేషన్ లో సినిమా రావాలని చాలా మంది ఆశ పడుతున్న తరుణంలో పూజా నాని పేరు చెప్పడం అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది.
రీసెంట్ గా ఓదెల2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్నా కూడా తాను శర్వానంద్ తో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నట్టు బహిరంగంగా తెలపగా, ఇప్పుడు పూజా తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇక రెట్రో విషయానికొస్తే కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కలిసి పూజా చేస్తున్న మొదటి సినిమా ఇది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూజా ఇంతకుముందు పాత్రలకు భిన్నంగా మేకప్ లేకుండా డీ గ్లామర్ రోల్ లో కనిపిస్తుంది.
ఇప్పటికే రిలీజైన రెట్రో ట్రైలర్ లో పూజా లుక్స్, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, సూర్యతో పూజా కెమిస్ట్రీ అన్నీ చాలా కొత్తగా బాగా అనిపిస్తున్నాయి. సూర్య స్వీయ నిర్మాణంలో నిర్మించిన రెట్రోలో మంచి లవ్ స్టోరీతో పాటూ ఎమోషన్స్ కూడా ఉంటాయని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. రెట్రో ప్రమోషన్స్ లో భాగంగా పూజాకు మీకు ఏ తెలుగు హీరోతో కలిసి వర్క్ చేయాలనుందనే ప్రశ్న ఎదురైంది.
దానికి పూజా అసలే మాత్రం ఆలోచించకుండా కచ్ఛితంగా నాని నే అని చెప్పేసింది. నిన్ను కోరి సినిమాలో నాని యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని, అతని యాక్టింగ్ లో ఏదో స్పెషల్ మ్యాజిక్ ఉంటుందని, అతనితో వర్క్ చేయడం ఈజీగా, సరదాగా ఉంటుందని కూడా తాను విన్నానని, నానిపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టింది పూజా హెగ్డే. పూజా నానితో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుందని చెప్పి ఆమె ఫ్యాన్స్ లో మరియు ఫిల్మ్ మేకర్స్ లో కొత్త ఇంట్రెస్ట్ ను కలిగించింది. మరి నానితో యాక్ట్ చేయాలనే పూజా కల త్వరలోనే తీరుతుందా లేదా దానికి ఇంకా టైమ్ పడుతుందా అనేది చూడాలి. మొత్తానికి రెట్రో ఇంటర్వ్యూల్లో అందరికంటే ఎక్కువ యాక్టివ్ గా ఉంటున్న పూజా పలు విషయాల వల్ల వార్తల్లో నిలుస్తూ ఆ కష్టానికి తగ్గ గుర్తింపు కూడా అందుకుంటుంది.
