మేకప్ లేకుండా రమ్మన్నారు.. ఎంతో ఫీలయ్యా: పూజా
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 19 April 2025 4:01 PM ISTస్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో ఇప్పుడు మరికొద్ది రోజుల్లో రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా నటిస్తున్న ఆ సినిమా.. మే1వ తేదీన విడుదల కానుంది. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంపై ఇప్పటికే మంచి బజ్ ఉంది.
అదే సమయంలో రెట్రో మేకర్స్ రిలీజ్ చేస్తున్న ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్.. సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. దీంతో మూవీ కోసం సినీ ప్రియులు, అభిమానులు వెయిట్ చేస్తున్నారు. హీరో హీరోయిన్లు సూర్యతోపాటు పూజా హెగ్డే కూడా మంచి హిట్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
అయితే ప్రమోషన్స్ లో భాగంగా పూజా హెగ్డే.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఆ సమయంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రెట్రో డైరెక్టర్ కార్తిక్ తనను మేకప్ లేకుండా కలవమని చెప్పినట్లు గుర్తు చేసుకున్న పూజ.. అలా సహజమైన లుక్ తో సినిమాల్లో నటించాలంటే చాలా ఇష్టమని చెప్పింది.
రెట్రో నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లో పూజా నేచురల్ గా కనిపిస్తోంది. ఆ మధ్య ఆమె లుక్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. కానీ పూజ నేచురాలిటీతో బాగుందని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. అయితే రాధేశ్యామ్ లో తన యాక్టింగ్ నచ్చి.. రెట్రోకు డైరెక్టర్ ఎంపిక చేశారని మరో ఇంటర్వ్యూలో చెప్పింది పూజ.
ఇక ఆమె అప్ కమింగ్ సినిమాల విషయానికొస్తే.. కాస్త గ్యాప్ తర్వాత ఓ తెలుగు మూవీకి తాను సైన్ చేసినట్లు రీసెంట్ గా తెలిపింది. ఆ ప్రాజెక్టు కు సంబంధించిన వివరాలు త్వరలో అనౌన్స్ చేస్తారని చెప్పింది. కంప్లీట్ లవ్ స్టోరీ అని చెప్పడంతో సినీ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అమ్మడు ఏ ప్రాజెక్టులో నటిస్తుందోనని అంతా మాట్లాడుకుంటున్నారు.
దాంతోపాటు దళపతి విజయ్ జన నాయగన్ లో యాక్ట్ చేస్తోంది పూజ. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రానున్న ఆ సినిమాకు హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవ లారెన్స్ కాంచన-4లో కూడా కనిపించనుంది అమ్మడు. ఆ తర్వాత కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందుతున్న కూలీలో సందడి చేయనున్న పూజ.. స్పెషల్ సాంగ్ తో మెప్పించనుందని టాక్.
