డైరెక్టర్ కి పూజాహెగ్డే సవాల్!
ఇక ఈ సినిమా కోసం పూజాహెగ్గే సొంతగా డబ్బింగ్ చెబుతానని ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 April 2025 4:22 PM ISTముంబై బ్యూటీ పూజాహెగ్డే మళ్లీ హీరోయిన్గా బిజీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ సినిమా లతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. `రెట్రో` సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఇందులో అమ్మడు సూర్యకి జోడీగా నటించింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన చిత్రం ఇప్పటికే షూటింగ్ ముగించుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఇక ఈ సినిమా కోసం పూజాహెగ్గే సొంతగా డబ్బింగ్ చెబుతానని ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుని సొంత గాత్రంతోనే ప్రేక్షకుల ముందుకెళ్తానంది. అన్నట్లుగానే అమ్మడు `రెట్రో`కి డబ్బింగ్ చెబుతుంది. దానికి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. డబ్బింగ్ చెప్పిన అనుభవం అమ్మడికి లేకపోవడంతో అంతా కొత్తగా ఫీలైనట్లు కనిపిస్తుంది.
డబ్బింగ్ చెప్పడం అంత సులభమైంది కాదు. సీన్ చూస్తూ సన్నివేశానికి తగ్గట్టు చెప్పాలి. చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టెకుని....చేతిలో స్క్రిప్ట్ డైలాగులు చూసుకుంటూ ప్రతీ పదంలోనూ కచ్చితత్వం తో కాన్పిడెంట్ గానే డబ్బింగ్ చెబుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంట్రెస్టింట్ డిస్కషన్ కూడా సాగిందక్కడ. మైక్ స్థానంలో కూర్చున్న పూజాహెగ్డే డైరెక్టర్ కార్తీక్ వైపు చూస్తు నేను మరోటేక్ చేయడానికి సిద్దంగా ఉన్నానంటూ సవాల్ విసిరింది.
ఆ టేక్ డబ్బింగ్ కోసమా? మళ్లీ సెట్ లో సీన్ కోసమా? అన్నది డైరెక్టర్ కి అర్దం కాలేదు. ఆ కాసేపటికి కార్తీక్ సరే అంటాడు. ఇద్దరి మధ్య ఇదో సరదా సన్నివేశం. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. రెట్రో మే 1న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కంగువ తర్వాత సూర్య నుంచి రిలీజ్ అవుతున్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన పాటలకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
