అసలు సూర్య కళ్ళల్లో ఉన్న మ్యాజిక్ ఏంటీ?
ఈ సందర్భంగా సోషల్ మీడియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూజా హెగ్డే హీరో సూర్య కళ్లల్లో ఉన్న మ్యాజిక్ గురించి మాట్లాడి ఆశ్చర్యపరిచింది.
By: Tupaki Desk | 18 April 2025 7:09 AMసూర్య..కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న హీరో ఆయన. వివాదాలకు దూరంగా ఉంటూ సినిమానే లోకంగా విభిన్నమైన పాత్రలు, సినిమాలతో జయాపజయాలకు భిన్నంగా కెరీర్‌ని కొనసాగిస్తున్నారు. కొత్త తరహా సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరో సూర్య `కంగువా`తో భారీ డిజాస్టర్‌ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫ్లాప్‌తో కొంత నిరాశకు గురైన ఆయన ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ విభిన్నమైన ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు.
కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో `రెట్రో`, ఆర్.జె.బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌తో పాటు వెట్టరిమారన్ డైరెక్షన్‌లో `వడివాసల్` మూవీ చేస్తున్నారు. ఇందులో వెట్రిమారన్ `వడివాసల్` ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా ఆర్.జె. బాలాజీ రూపొందిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రోడక్షన్ దశలో ఉంది. ఇక కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిస్తున్న `రెట్రో` మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది.
రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ మే 1న తమిళంతో పాటు తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇందులో సూర్యకు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అంతే కాకుండా శ్రియ ఇందులోని ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవబోతోంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్‌ని తెలుగులో పూజా హెగ్డేతో టీమ్ మొదలు పెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూజా హెగ్డే హీరో సూర్య కళ్లల్లో ఉన్న మ్యాజిక్ గురించి మాట్లాడి ఆశ్చర్యపరిచింది.
`సూర్య కళ్లల్లో ఏదో సూపర్ పవర్ ఉంది. అంతే కాకుండా ఆయన కళ్లల్లో వెయ్యికి పైగా ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. ఒక్కోసారి అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒక్కో సారి చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి షాట్‌కు ఆయన ఒరిజినల్‌గా, చాలా నిజాయితీగా నటిస్తారు. అది ఆయనతో కలిసి నటించే వాళ్లకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మీ సీక్రెట్ ఏంటీ? ఇన్నేళ్లుగా అదే ఫిజిక్‌ని మెయింటైన్ చేస్తూ కళ్లతో ఎలా మ్యాజిక్ చేస్తున్నారు? అని సూర్యని అడిగాను. అయితే ఆయన ఆ రహస్యం ఏంటన్నది చెప్పలేదు` అని తెలిపింది బుట్టబొమ్మ.