Begin typing your search above and press return to search.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి… పొలిటికల్ లుక్ వైరల్

డిసెంబర్ 7న ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది.సినిమాకి సంబందించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ నెక్స్ట్ మంత్ నుంచి మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది

By:  Tupaki Desk   |   24 Oct 2023 8:37 AM GMT
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి… పొలిటికల్ లుక్ వైరల్
X

విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతోన్న మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గోదావరి నేపథ్యంలో పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం సిద్ధం అవుతోంది. ఈ మూవీలో విశ్వక్ సేన్ కూడా ఇది వరకు ఎన్నడూ లేని విధంగా డిఫరెంట్ లుక్ లో దర్శనం ఇస్తున్నాడు. అలాగే మూవీ కోసం ప్రత్యేకంగా గోదావరి స్లాంగ్ నేర్చుకొని మరీ డబ్బింగ్ చెబుతున్నాడు.

డిసెంబర్ 7న ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది.సినిమాకి సంబందించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ నెక్స్ట్ మంత్ నుంచి మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. నేహా శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఓ ఇంటరెస్టింగ్ రోల్ లో అంజలి కనిపించబోతోంది. యువన్ శంకర్ రాజా చాలా కాలం తర్వాత ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే వచ్చిన ఒక సాంగ్ మంచి హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే దసరా సందర్భంగా ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో వైట్ అండ్ వైట్ వేసుకొని జీప్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నట్లు విశ్వక్ సేన్ లుక్ ఉంది. చేతులు పైకి ఎత్తి అందరికి దండాలు పెడుతూ ఉండగా జీప్ కి ముందు పడవలు నిలుపుకొనే యాంకర్ గుర్తుతో ఎర్రజెండా ఉంది.

ఇది పార్టీ జెండా అని పోస్టర్ డిజైన్ బట్టి తెలుస్తోంది. జీప్ బ్యాక్ డ్రాప్ లో అస్త్రాలు పట్టుకొని కనకదుర్గా ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. పోస్టర్ లుక్ బట్టి సినిమాలో పొలిటికల్ టచ్ గట్టిగానే ఉండబోతోందని తెలుస్తోంది. అయితే వీటిలో ప్రెజెంట్ పొలిటికల్ డ్రామాని కృష్ణ చైతన్య చూపిస్తాడా లేదంటే పీరియాడిక్ జోనర్ మూవీ కాబట్టి తన స్టైల్ లో రిప్రజెంట్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటి వరకు కాస్తా ట్రెండ్ లో ప్రెజెంట్ లో ఉండే సినిమాలు చేసిన విశ్వక్ సేన్ మొదటి సారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కోసం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. మరి అతనికి ఈ మూవీ ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.