Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : పొలిటికల్‌ స్టేజ్ పై టాలీవుడ్‌ మల్టీస్టారర్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఒకే స్టేజ్ పై కలిసి కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది

By:  Tupaki Desk   |   29 Feb 2024 12:26 PM IST
పిక్ టాక్ : పొలిటికల్‌ స్టేజ్ పై టాలీవుడ్‌ మల్టీస్టారర్‌
X

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఒకే స్టేజ్ పై కలిసి కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అది కూడా ఒకే స్టేజ్ పై ఇద్దరు స్టార్‌ హీరోలు కనిపించారు అంటే ఆయా హీరోల ఫ్యాన్స్ కి కన్నుల పండుగే. అలాంటి కన్నుల పండుగ వంటి మూమెంట్‌ పొలిటికల్‌ స్టేజ్ పై ఏర్పడింది.

తాజాగా తెలుగు దేశం మరియు జనసేన పార్టీ లు కలిసి ఏర్పాటు చేసిన మీటింగ్ ఈ అరుదైన కలయికకి వేదికగా నిలిచింది. పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ లు కలిసి ఫోటోలకు ఫోజ్ ఇవ్వడంతో పాటు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించారు.

చిరంజీవి మరియు బాలకృష్ణ లు సినిమాల పరంగా, వృత్తి పరంగా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఒకానొక సమయంలో పవన్ మరియు బాలయ్య ల మధ్య కూడా మాటల యుద్దం జరిగింది. వాటన్నింటిని పక్కన పెట్టి ఇప్పుడు పవన్‌ మరియు బాలయ్య లు ఇలా ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ కి కన్నుల విందు అనడంలో సందేహం లేదు.

పొలిటికల్‌ స్టేజ్ పై ఇలా మల్టీ స్టారర్‌ పిక్ ను చూడటం చాలా ఆశ్చర్యంగా మరియు అరుదుగా అనిపిస్తోందని నెట్టింట ఆయా హీరోల ఫ్యాన్స్ మరియు రాజకీయ వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. సోషల్‌ మీడియాలో బాలయ్య, పవన్ ల ఆత్మీయ ఆలింగనం ఫోటోలు మరియు కలిసి విక్టరీ సింబల్ చూపించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

గతంలో వీరిద్దరు కలిసి నటిస్తే బాగుంటుందని భావించిన వారు ఇప్పుడు ఒకే వేదిక పై కలిసి కనిపించడంతో కొంతలో కొంత అయినా తమ కోరిక నెరవేరింది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలను సినీ వర్గాల వారు కూడా తెగ షేర్‌ చేస్తున్నారు.