Begin typing your search above and press return to search.

సినిమా కోసం ప్రాణాలకు తెగించిన హీరో.. సిక్స్ ప్యాక్ కాదు.. ఏకంగా 53 కేజీలు తగ్గాడు

సినిమా కోసం హీరోలు బరువు పెరగడం, సిక్స్ ప్యాక్స్ కోసం కష్టపడటం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఒక మరాఠీ హీరో ఏకంగా 53 కిలోల బరువు తగ్గాడంటే మామూలు విషయం కాదు.

By:  Tupaki Desk   |   9 May 2025 3:00 AM IST
Padmaraj Raj Gopal Nair Transformation
X

సినిమా కోసం హీరోలు బరువు పెరగడం, సిక్స్ ప్యాక్స్ కోసం కష్టపడటం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఒక మరాఠీ హీరో ఏకంగా 53 కిలోల బరువు తగ్గాడంటే మామూలు విషయం కాదు. అది కూడా తన ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా కూడా సినిమా మీద ఉన్న ఫ్యాషన్ తో చేశాడు.

మరాఠీ ఇండస్ట్రీకి చెందిన పద్మరాజ్ రాజ్ గోపాల్ నాయర్ స్వయంగా దర్శకత్వం వహించిన 'మాఝి ప్రార్థన' అనే సినిమాలో ఒక సీన్ కోసం ఆయన అస్థిపంజరంలా కనిపించాలి. దానికోసం ఆయన ఏకంగా 53 కిలోల బరువు తగ్గిపోయారు. ఈ వీడియోను సినిమా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ సినిమా రేపు థియేటర్లలోకి రానుంది.

సాధారణంగా హీరోలు సినిమా కోసం బరువు పెరగడానికో, కండలు తిరిగిన శరీరం కోసం తెగ కష్టపడటానికో వెనకాడరు. కానీ పద్మరాజ్ చేసిన పని మాత్రం చాలా సాహసోపేతమైనది. ఒక సినిమాలోని సన్నివేశం కోసం ఏకంగా 53 కిలోల బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా తన ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా ఆయన ఆ పాత్ర కోసం అంతలా కష్టపడ్డారు.

'మాఝి ప్రార్థన' సినిమా ఆయనకు చాలా ప్రత్యేకమైనదిగా కనిపిస్తోంది. అందుకే దర్శకత్వంతో పాటు ఒక ముఖ్యమైన పాత్రలో కూడా ఆయన నటించారు. ఆ పాత్ర డిమాండ్ చేయడంతోనే ఆయన అంతలా బరువు తగ్గినట్లు తెలుస్తోంది. విడుదలైన వీడియోలో ఆయన నిజంగానే అస్థిపంజరంలా కనిపిస్తున్నారు. అంతలా బరువు తగ్గడం వల్ల ఆయన శరీరం బాగా బలహీనంగా మారిపోయి ఉండొచ్చు.

ఈ సినిమా రేపు విడుదల కానుండటంతో ప్రేక్షకులు ఈ సాహసోపేతమైన నటుడిని ఎలా ఆదరిస్తారో చూడాలి. ఒక నటుడు తన పాత్ర కోసం ఎంతవరకైనా వెళ్లగలడో పద్మరాజ్ నిరూపించారని ఆయన అభిమానులు అంటున్నారు. ఈ సినిమా ఒక ప్రత్యేకమైన కథతో వస్తోందని, పద్మరాజ్ నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. కానీ ఒక నటుడిగా పద్మరాజ్ మాత్రం తన అంకితభావంతో అందరినీ ఆశ్చర్యపరిచారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.