2025: భారత్-పాక్ వార్ ఎవరి చేతుల్లోకి?
ఈ నేపథ్యంలో 'ఉరి' డైరెక్టర్ ఆదిత్యధర్ పేరు తెరపైకి వస్తుంది. ఆదిత్య ధర్ గతంలో సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో 'ఉరీ' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 May 2025 12:57 PMదాయాది పాకిస్తాన్ పై 'ఆపరేషన్ సిందూర్' పేరిట భారత్ ప్రతిదాడికి దిగిన సంగతి తెలిసిందే. భారతీ యల్ని మతం అడిగి మరీ చంపడంతో అదే పాకిస్తాన్ మూకలకు ఇద్దరు శక్తివంతమైన మహిళలతోనే ధీటు గా బధులిచ్చారు. ఆపరేషన్ సిందూర్ పేరిట నిర్వహించిన దాడుల్లో ఉగ్రమూకల స్థావరాలను, ఇళ్లను ధ్వంసం చేసారు. తొమ్మిది స్థావారలపై రాత్రికి రాత్రే దాడి చేసి ధీటన బధులిచ్చారు మహిళా నారీ మణులు. భారత్ పై ఉగ్రమూకలు దాడి చేస్తే యుద్దం మగాళ్లే చేయాల్సిన పనిలేదని నిరూపించారు భారత మహిళలు.
నారీమణులతో మట్టు బెడతామని పాకిస్తాన్ కు బలమైన హెచ్చరికలు పంపించారు. ఇదంతా ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ చేపట్టిన ఆరేషన్. అటుపై పాకిస్థాన్ సైనిక చర్యలకు దిగడంతో 'ఆపరేషన్ సిందూర్ 2.0' తో భారత సైన్యం రంగంలోకి దిగడంతో? దాయాది దెబ్బకు తోక ముడిచిన సంగతి తెలి సిందే. చివరకు అగ్ర రాజ్యం అమెరికా రంగంలోకి దిగడంతో? కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి.
ఈ వార్ పై బాలీవుడ్ లో సినిమా తీయడం కచ్చితంగా జరుగుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కొన్ని రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కథను ఎవరు డీల్ చేస్తే బాగుంటుంది? అన్నదే ఆసక్తికరం. ఈ నేపథ్యంలో 'ఉరి' డైరెక్టర్ ఆదిత్యధర్ పేరు తెరపైకి వస్తుంది. ఆదిత్య ధర్ గతంలో సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో 'ఉరీ' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
ప్రతి దాడిలో భాగంగా ఉగ్రమూకల స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన దాడుల నేపథ్యంలో ఎంతో ఆస క్తిగారంగా తెరకెక్కించిన చిత్రమిది. పాన్ ఇండియాలో ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. గొప్ప దేశ భక్తిని చాటి చెప్పిన చిత్రంగా నిలిచింది. మేకింగ్ పరంగానూ హైలైట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ బాద్యతలు ఆదిత్యధర్ తీసుకుంటే బాగుంటుందని సోషల్ మీడియాలో పోస్ట్లు పడుతున్నాయి.