Begin typing your search above and press return to search.

హృతిక్‌కి పోటీగా కండ‌లు పెంచిన తార‌క్

ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత `దేవ‌ర` లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. దేవ‌ర రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది.

By:  Tupaki Desk   |   12 April 2024 4:59 AM GMT
హృతిక్‌కి పోటీగా కండ‌లు పెంచిన తార‌క్
X

ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత `దేవ‌ర` లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. దేవ‌ర రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది. ఇంత‌లోనే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ తో క‌లిసి వార్ 2లో న‌టిస్తున్నాడ‌ని ప్ర‌క‌టించ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవ్. వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల‌తో తార‌క్ రేంజ్ అమాంతం స్కైని ట‌చ్ చేయ‌నుందంటూ నంద‌మూరి అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో `వార్ 2` షూటింగ్ లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ ముంబై చేరుకున్నారు. తార‌క్ YRF కార్యాలయానికి చేరుకోగానే ముంబై మీడియా అత‌డిని చుట్టుముట్టేసింది. ఈ చిత్రానికి సంబంధించిన అతని లుక్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కోసం ఎన్టీఆర్ కండలు తిరిగిన బాడీని నిర్మించినట్లు అస్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. నిజానికి తార‌క్ ష‌ర్ట్ ధ‌రించ‌డంతో అత‌డి మెలితిరిగిన కండ‌లు క‌నిపించ‌డం లేదు కానీ, అత‌డు మునుప‌టి కంటే ఫిట్ గా క‌నిపిస్తున్నాడని అర్థ‌మ‌వుతోంది.

తాజా స‌మాచారం మేర‌కు.. కొత్త షెడ్యూల్ 10 రోజులు ఉంటుంది. ఈ సమయంలో చిత్ర‌బృందం హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో జూనియర్ ఎన్టీఆర్ త‌ల‌ప‌డే స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తార‌ని తెలిసింది. హృతిక్ తో ఢీ అంటే ఢీ అనే స‌న్నివేశాలు తెర‌కెక్క‌నున్నాయ‌ని స‌మాచారం. ఇందులో కియ‌రా అద్వానీ కథానాయికగా నటిస్తుందని చిత్ర బృందం ధృవీకరించింది. కానీ త‌ను ఎవరితో రొమాన్స్ చేస్తోంది? అనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

YRF స్పై యూనివర్స్‌లో భాగంగా ఆదిత్య చోప్రా వార్ 2ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. యే జవానీ హై దీవానీ, బ్ర‌హ్మాస్త్ర చిత్రాల‌ను తెర‌కెక్కించిన‌ అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వార్ 2 చిత్రం 14 ఆగష్టు 2025న థియేటర్లలో విడుదల కానుంది. జగపతి బాబు కూడా ఈ ప్రాజెక్ట్‌లో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. 2024 స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా తార‌క్ ఫ్యాన్స్ థియేట‌ర్ల‌లో త‌మ ఫేవ‌రెట్ ట్రీట్ ని ఆస్వాధించ‌నున్నారు.