Begin typing your search above and press return to search.

16 నుంచి తార‌క్ ముహూర్తం పెట్టేసాడా?

బాలీవుడ్ డెబ్యూ `వార్ -2` షూట్ కి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎప్పుడు హాజ‌ర‌వుతాడు? అంటూ కొన్ని రోజులుగా స‌స్పెన్స్ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 April 2024 7:55 AM GMT
16 నుంచి తార‌క్ ముహూర్తం పెట్టేసాడా?
X

బాలీవుడ్ డెబ్యూ `వార్ -2` షూట్ కి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎప్పుడు హాజ‌ర‌వుతాడు? అంటూ కొన్ని రోజులుగా స‌స్పెన్స్ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. `దేవ‌ర -2` షూటింగ్ కి కూడా బ్రేక్ ఇవ్వ‌డంతో `వార్ -2` షురూ చేసేది ఎప్పుడంటూ అభిమానులంతా ఒక‌టే ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ స‌మ‌యం ఆస‌న్న‌మైంది. యంగ్ టైగ‌ర్ ఆ డేట్ ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈనెల 16 నుంచి `వార్ -2` సెట్స్ లో టైగ‌ర్ గాండ్రిపు షురూ అవుతుంది. ముంబైలో జ‌రుగుతోన్న షూటింగ్ లో తార‌క్ జాయిన్ అవ్వ‌బోతున్నాడు. ఇది కేవ‌లం ప‌ది రోజుల షెడ్యూల్ మాత్ర‌మే.

తార‌క్ జాయిన్ అయిన నాటి నుంచి మేక‌ర్స్ ఆయ‌న‌కు సంబంధించిన స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణపైనే దృష్టి పెడ‌తార‌ని తెలుస్తోంది. ప‌దిరోజుల షెడ్యూల్ అనంత‌రం మ‌ళ్లీ యూనిట్ కొంత బ్రేక్ ఇవ్వ‌నుంది. ఈ స‌మ‌యంలో తార‌క్ `దేవ‌ర` మిగ‌తా భాగం షూటింగ్ పూర్తిచేస్తాడు. దీంతో దేవ‌ర షూట్ దాదాపు క్లైమాక్స్ కి వ‌చ్చేస్తుంది. బహుశా అదే చివ‌రి షెడ్యూల్ అయ్యే అవ‌కాశం ఉంది. ఆ త‌ర్వాత `వార్ -2` షూట్ లోనే తార‌క్ పూర్తి స్థాయిలో పాల్గొంటాడ‌ని తెలుస్తోంది. తాజాగా తార‌క్ పాత్ర‌కి సంబంధించిన అప్ డేట్ కూడా అందుతోంది.

ఇందులో తార‌క్ కూడా హృతిక్ త‌ర‌హాలోనే స్పై పాత్ర పోషిస్తున్న‌ట్లు లీకులందుతున్నాయి. హృతిక్ పాత్ర‌కు ధీటుగానే ఈ రోల్ కూడా ఉంటుంద‌ని అంటున్నారు. ఇంత‌కు ముందు రా ఏజెంట్ పాత్ర‌లో తార‌క్ న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. మ‌రి తాజాగా అప్ డేట్ నేప‌థ్యంలో రోల్ ఎలాంటిది? అన్న దానిపై మ‌రోసారి స‌స్పెన్స్ మొద‌లైంది. ఆ స‌స్పెన్స్ కి తెర ప‌డాలంటే మేక‌ర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక సినిమాని వ‌చ్చే ఏడాది వేస‌విలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌.

చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా విదేశీ షెడ్యూల్స్ కూడా ఎక్కువ‌గానే ఉన్నాయిట‌. అలాగే సినిమాకి టెక్నిక‌ల్ వ‌ర్క్ కూడా కీల‌కం కానుందిట‌. ఈ నేప‌థ్యంలో ప‌నులు అన్ని ఆల‌స్య‌మయ్యే అవ‌కాశం ఉండ‌టంతో వేసికి వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈస్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని ఆయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కిస్తోన్న సంగ‌త తెలిసిందే. య‌శ్ రాజ్ ఫిలింస్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తుంది.