Begin typing your search above and press return to search.

తారక్ అసలు యుద్ధం మొదలైంది!

మొదటి రోజు హృతిక్ రోషన్, తారక్ మధ్య కీలక యాక్షన్ ఘట్టాలు షూట్ చేయబోతున్నారంట. ఈ మూవీ షూటింగ్ లో తారక్ ఐదు రోజుల పాటు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   11 April 2024 5:31 AM GMT
తారక్ అసలు యుద్ధం మొదలైంది!
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో సిద్ధం అవుతోన్న ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. కాంబినేషన్ తోనే మేకర్స్ కావాల్సిన హైప్ క్రియేట్ చేశారు.

రీసెంట్ గా సినిమా నార్త్ రిలీజ్ హక్కులను కరణ్ జోహార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన రాకతో సినిమాకు బాలీవుడ్ లో మంచి రిజల్ట్ అందే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకొని తారక్ దేవర మూవీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి వార్ 2 సినిమాతో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో తారక్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ మూవీలో తారక్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించబోతున్నాడంట. ఇదిలా ఉంటే శుక్రవారం ఈ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అవ్వబోతున్నారంట.

మొదటి రోజు హృతిక్ రోషన్, తారక్ మధ్య కీలక యాక్షన్ ఘట్టాలు షూట్ చేయబోతున్నారంట. ఈ మూవీ షూటింగ్ లో తారక్ ఐదు రోజుల పాటు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మరల ఏప్రిల్ 17 నుంచి దేవర షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ఏప్రిల్ 21 వరకు దేవర సినిమాకి సంబందించి కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

దేవర షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని వెంటనే వార్ 2 షూటింగ్ లో తారక్ జాయిన్ అవ్వనున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఇలా వార్ 2, దేవర మూవీస్ రెండు కూడా బ్యాక్ టూ బ్యాక్ షూట్స్ పెట్టుకొని తారక్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారంట. దేవర సినిమా షూటింగ్ చివరి దశకి వచ్చేసింది.

ఈ నేపథ్యంలో మెజారిటీ కాల్ షీట్స్ వార్ 2 కోసం తారక్ కేటాయించినట్లు తెలుస్తోంది. వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి చేసే డాన్స్ మూమెంట్స్ కూడా ఉంటాయి. కచ్చితంగా బాలీవుడ్ ఆడియన్స్ కి వీరిద్దరి కాంబినేషన్ ఎగ్జైట్ చేస్తుందనే మాట వినిపిస్తోంది. హృతిక్ రోషన్ కూడా తారక్ తో కలిసి స్టెప్పులేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.