Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ 'వార్‌' మొదలుపై గందరగోళం

'వార్‌ 2' సినిమా షూటింగ్‌ కి 2024 జనవరిలో ఎన్టీఆర్‌ జాయిన్‌ అవ్వాల్సి ఉంది. అందుకు తగ్గట్లుగా మొదట ఎన్టీఆర్ తన దేవర సినిమా ను 2023 డిసెంబర్‌ లో ముగించాలని భావించారు.

By:  Tupaki Desk   |   12 Dec 2023 5:36 AM GMT
ఎన్టీఆర్‌ వార్‌ మొదలుపై గందరగోళం
X

ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న దేవర సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. దేవర సినిమా మొదటి భాగం షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే వార్‌ 2 షూటింగ్‌ లో ఎన్టీఆర్‌ పాల్గొనాల్సి ఉంది.

'వార్‌ 2' సినిమా షూటింగ్‌ కి 2024 జనవరిలో ఎన్టీఆర్‌ జాయిన్‌ అవ్వాల్సి ఉంది. అందుకు తగ్గట్లుగా మొదట ఎన్టీఆర్ తన దేవర సినిమా ను 2023 డిసెంబర్‌ లో ముగించాలని భావించారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్‌ దేవర సినిమాను 2024 ఫిబ్రవరి లేదా మార్చి వరకు చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. దాంతో వార్ 2 ఎప్పుడు అనే చర్చ మొదలైంది.

దేవర సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ ని పెంచడంతో వార్‌ 2 సినిమా షూటింగ్‌ ఆలస్యం అయినట్లుగా తెలుస్తోంది. ఇంతకు ఎప్పుడు వార్‌ 2 మొదలు అవ్వబోతుంది అంటూ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్‌ వార్‌ 2 తో హిందీ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు.

హిందీ లో ఎన్టీఆర్ తొలి సినిమా అవ్వడంతో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ షూటింగ్‌ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఫ్యాన్స్ గందరగోళంలో ఉన్నారు.

బాలీవుడ్‌ లో జరుగుతున్న ప్రచారం మేరకు సల్మాన్‌ ఖాన్‌ టైగర్‌ 3 సినిమా ఫలితం నేపథ్యం లో వార్‌ 2 కి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందుకే ఆలస్యం అంటున్నారు. మరి వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌ లో అయినా వార్‌ 2 మొదలయ్యేనా చూడాలి.