Begin typing your search above and press return to search.

ముంబైలో టాలీవుడ్ పులి.. వేట మొదలైంది!

కానీ రాజమౌళి వచ్చిన తర్వాత మన హీరోలకు అక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది.

By:  Tupaki Desk   |   22 April 2024 10:00 AM GMT
ముంబైలో టాలీవుడ్ పులి.. వేట మొదలైంది!
X

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు మన హీరోలకు మంచి క్రేజ్ అయితే దక్కుతోంది. ఒకప్పుడు చిరంజీవి నాగార్జున వెంకటేష్ లాంటి హీరోలు అక్కడ డైరెక్టర్ సినిమాలు చేసే మంచి సక్సెస్ అందుకోవాలని అనుకున్నారు. కానీ ఒకటి రెండు సినిమాల వరకే వారి ప్రయత్నాలు తగ్గిపోయాయి. మళ్ళీ పెద్దగా అటువైపుగా ఫోకస్ చేయలేదు. కానీ రాజమౌళి వచ్చిన తర్వాత మన హీరోలకు అక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది.

డైరెక్ట్ సినిమాలు కాకుండా పాన్ ఇండియా రేంజ్ అంటూ ఒక సరికొత్త ఫార్మర్ సెట్ చేయడంతో మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ఇక రాబోయే రోజుల్లో మన టాలీవుడ్ స్టార్స్ కోసం కూడా అక్కడి దర్శక నిర్మాతలు ఎగబడతారు అని చెప్పవచ్చు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రతిష్టాత్మక హిందీ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ వార్ 2 సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అతనికి దీటుగా పవర్ఫుల్ పాత్రలో సర్ ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాడు. నెగిటివ్ షేడ్స్ లోనే ఆ క్యారెక్టర్ ఉంటుంది అని అంతేకాకుండా పాత్ర బ్యాగ్రౌండ్ లో బలమైన ఎమోషన్ కూడా ఉంటుంది అని ఇదివరకే కొన్ని గాసిప్స్ పుట్టుకొచ్చాయి.

ఇక ఇది ఎంతవరకు నిజం అనేది సినిమా వచ్చేవరకు సస్పెన్స్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ముంబైలో దిగిపోయాడు. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. లుక్ అయితే అదిరిపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి.

దాదాపు మూడు వారాలకు పైగానే ఎన్టీఆర్ ఆ షెడ్యూల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ద్వారా కొన్ని యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తారని సమాచారం. కేవలం యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా ఎన్టీఆర్ డాన్స్ తో కూడా బాలీవుడ్ జనాలకు సరికొత్త కిక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

అసలు హృతిక్ రోషన్ టాప్ డాన్సర్ గా బాలీవుడ్లో మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక అతనికి దీటుగా ఎన్టీఆర్ కూడా తన డ్యాన్స్ తో పోటీ ఇస్తే మాత్రం బాలీవుడ్ స్క్రీన్స్ కూడా బ్లాస్ట్ అవుతాయి అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం సౌత్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా సినిమా మాత్రం సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చెప్పవచ్చు. మరి దర్శకుడు అయాన్ ముఖర్జీ జూనియర్ ఎన్టీఆర్ ను అంచనాలకు తగ్గట్టుగా ప్రజెంట్ చేస్తాడో లేదో చూడాలి.