Begin typing your search above and press return to search.

వార్ -2 లో యంగ్ టైగ‌ర్ రోల్ ఇదేనా?

కానీ ఇంత‌వ‌ర‌కూ యంగ్ టైగ‌ర్ రోల్ ఎలా ఉంటుంది? అన్న‌ది ఎక్క‌డా లీక్ అవ్వ‌లేదు.

By:  Tupaki Desk   |   6 March 2024 6:24 AM GMT
వార్ -2 లో యంగ్ టైగ‌ర్ రోల్ ఇదేనా?
X

బాలీవుడ్ డెబ్యూలో యంగ్ టైగ‌ర్ రోల్ ఎలా ఉంటుంది? హృతిక్ రోష‌న్ కి ధీటుగా ఉండ‌బోతుందా? అది పాజిటివ్ రోల్ నా? నెగిటివ్ రోల్ నా? లేక అంత‌కు మంచి టైగ‌ర్ ని లాంచ్ చేస్తున్నారా? ఇలా ఎన్నో సందేహాలు తార‌క్ ఎంట్రీ క‌న్ప‌మ్ అయిన ద‌గ్గ‌ర నుంచి అభిమానుల్ని తొలిచేస్తున్న సందేహాలు. కానీ ఇంత‌వ‌ర‌కూ యంగ్ టైగ‌ర్ రోల్ ఎలా ఉంటుంది? అన్న‌ది ఎక్క‌డా లీక్ అవ్వ‌లేదు. డెబ్యూ సినిమా కావ డంతో గెస్సింగ్ కూడా క‌ష్ట‌మైంది. 'ఆర్ ఆర్ ఆర్' విజ‌యంతో పాన్ వ‌ర‌ల్డ్ లోనే సంచ‌ల‌న‌మ‌వ్వ‌డంతో? తార‌క్ రోల్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ఉంటుంది అన్న అంచ‌నా? త‌ప్ప అంత‌కు మించి గెస్ చేయ‌డం క‌ష్ట‌త‌రంగా మారింది.

ఆయాన్ ముఖ‌ర్జీ లాంటి యాక్ష‌న్ మేక‌ర్ అత‌డి పాత్ర‌ని ఎంత ప్ర‌త్యేకంగా మార్చ‌బోతున్నార‌ని? బాలీవుడ్ నుంచి సైతం కుదిపేసిన అంశం. తాజాగా చిత్ర వ‌ర్గాల నుంచి లీకైన స‌మాచారం ప్ర‌కారం యంగ్ టైగ‌ర్ ఇందులో ప‌వ‌ర్ ఫుల్ ఇండియ‌న్ రా ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని తెలిసింది. ఆ పాత్ర భ‌విష్య‌త్ లోనూ త‌రుచూ తెర‌పై క‌నిపించేలా డిజైన్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే తార‌క్ తో సోలోగా ఓ ప్ర‌త్యేక చిత్రాన్ని కూడా తీర్చి దిద్దేలా య‌శ్ రాజ్ స్పై యూనివ‌ర్శ్ ఆ పాత్ర‌ని మ‌లిచిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

తార‌క్ ఎంట్రీతో ఆ పాత్ర‌కే ప్ర‌త్యేక‌త వ‌చ్చిన‌ట్లు నిర్మాణ సంస్థ భావిస్తుందిట‌. సినిమాలో ఆ పాత్ర చాలా శ‌క్తివంతంగా ఉంటుంద‌ని...హీరో హృతిక్ రోష‌న్ కిధీటుగా ఉంటుంద‌ని అంటున్నారు. ఇండియా వైడ్ తార‌క్ అభిమానులు ఏమాత్రం నిరాశ ప‌డ‌కుండా అత‌డి ఇమేజ్ ని అంత‌కంత‌కు రెట్టింపు చేసేలా ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాల నుంచి సైతం వినిపిస్తోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో వాస్త‌వం ఎంతో తెలియాల్సి ఉంది. వ‌చ్చే నెల నుంచి తార‌క్ 'వార్ -2' షూటింగ్ లో జాయిన్ అవుతారు.

ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జ‌పాన్ లో జ‌రుగుతోంది. అక్క‌డ హృతిక్ రోష‌న్ పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక రిస్తున్నారు. అలాగే తార‌క్ 'దేవ‌ర' షూటింగ్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ వ‌న్ చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఈ నేప‌థ్యంలో తార‌క్ డేట్లు 'వార్-2' కి కేటాయించిన‌ట్లు తెలుస్తోంది.