Begin typing your search above and press return to search.

తారక్ పాన్ ఇండియా వ్యూహం భలే..

ఈ సినిమాల ప్లానింగ్ విషయంలో తారక్ తెలివిగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   10 April 2024 11:30 PM GMT
తారక్ పాన్ ఇండియా వ్యూహం భలే..
X

టాలీవుడ్ నుంచి 'బాహుబలి' మూవీతో ఇప్పటికే ప్రభాస్ పెద్ద పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. అల్లు అర్జున్ సైతం 'పుష్ప'తో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఇమేజ్ సంపాదించాడు. 'ఆర్ఆర్ఆర్'తో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లకూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. ఐతే చరణ్, తారక్.. ప్రభాస్ స్థాయికి ఎదుగుతారా లేదా అన్నది వారి తర్వాతి చిత్రాలకు జాతీయ స్థాయిలో వచ్చే క్రేజ్, జరిగే బిజినెస్, అవి కలెక్ట్ చేసే వసూళ్లను బట్టి ఆధారపడి ఉంది. తారక్ విషయానికి వస్తే.. అతడి కొత్త చిత్రం 'దేవర'ను పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు అతను 'వార్-2' మూవీతో బాలీవుడ్ అరంగేట్రం కూడా చేయబోతున్నాడు. ఈ సినిమాల ప్లానింగ్ విషయంలో తారక్ తెలివిగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

'వార్-2' సైన్ చేయడం ద్వారా 'దేవర' మీద బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఒక కన్నేసేలా చేశాడు. ఇప్పుడేమో 'దేవర'కు బాలీవుడ్ నుంచి బలమైన సపోర్ట్ తెచ్చుకున్నాడు. 'బాహుబలి'ని రిలీజ్ చేసిన కరణ్ జోహార్, అనిల్ తడానిలను 'దేవర' హిందీ రిలీజ్‌లో భాగస్వాముల్ని చేశాడు. వీళ్లిద్దరికీ ఉత్తరాదిన బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఉంది.

పైగా పబ్లిసిటీ కూడా ఒక రేంజిలో చేస్తారు. 'దేవర'ను వాళ్ల స్టయిల్లో ప్రమోట్ చేసి పెద్దగా రిలీజ్ చేసి సక్సెస్ చేశారంటే తారక్‌కు ఉత్తరాదిన క్రేజ్ బాగా పెరుగుతుంది. ఆలోపు 'వార్-2' కూడా వస్తుంది. ఆ సినిమాకు మామూలుగానే హైప్ ఎక్కువుంటుంది. దీనికి తోడు 'దేవర' అడ్వాంటేజ్ కూడా యాడ్ అయితే తారక్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్‌గా అవతరించడానికి ఛాన్సుంది. మొత్తానికి తారక్ 'పాన్ ఇండియా' వ్యూహం చాలా బలంగానే ఉన్నట్లుంది.