Begin typing your search above and press return to search.

గంగిరెడ్డి, ఎట్టా ఉన్నడు అల్లుడు!

ఇన్ని రోజులు దేవర మూవీ షూటింగ్ కోసం మాస్ లుక్ లో కనిపించిన తారక్ ఇప్పుడు కంప్లీట్ మేకోవర్ తో స్టైలిష్ గా కేరాఫ్ గా కనిపిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   2 March 2024 4:09 AM GMT
గంగిరెడ్డి, ఎట్టా ఉన్నడు అల్లుడు!
X

గ్లోబల్ స్టార్ ఇమేజ్ దిశగా దూసుకుపోతున్న నందమూరి హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీపైన ఫుల్ ఫోకస్ చేసి ఉన్నారు. కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఫిక్షనల్ స్టొరీతో పీరియాడిక్ జోనర్ లో మూవీ ఉండబోతోంది. అయితే గత కొంతకాలం నుంచి ఎన్టీఆర్ ఎక్కడ కనిపించిన మాసివ్ లుక్స్ లో కనిపిస్తూ ఉండేవారు.

తాజాగా తారక్ కి ప్రశాంత్ నీల్ కలిసారు. అలాగే కాంతారా ఫేం రిషబ్ శెట్టి కూడా మీట్ అయ్యారు. ఈ సందర్భంగా తారక్ న్యూ లుక్ తో కనిపించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కారులోంచి బయటకోస్తూ కళ్ళజోడు, గళ్ళ షర్టు వేసుకొని స్టైలిష్ గా నడుచుకొని వస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.

ఈ ఫోటోలో యంగ్ టైగర్ క్లాసిక్ లుక్ లో మెరిసిపోతూ ఉండటం విశేషం. ఇన్ని రోజులు దేవర మూవీ షూటింగ్ కోసం మాస్ లుక్ లో కనిపించిన తారక్ ఇప్పుడు కంప్లీట్ మేకోవర్ తో స్టైలిష్ గా కేరాఫ్ గా కనిపిస్తున్నాడు. నెక్స్ట్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ తారక్ చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం ఏమైనా ఎలా క్లీన్ షేవ్ తో స్టైలిష్ లుక్ లోకి తారక్ మారిపోయి ఉంటాడనే మాట వినిపిస్తోంది.

అయితే ఈ ఫోటో చూస్తుంటే ఆది సినిమాలోని డైలాగ్ ఎన్టీఆర్ అభిమానులకి వెంటనే గుర్తుకొస్తుంది. గంగిరెడ్డి ఎట్టా ఉన్నాడు అల్లుడు అనే డైలాగ్ కి కరెక్ట్ యాప్ట్ అయ్యేలా తారక్ కటౌట్ ఉందని చెప్పొచ్చు. కోట్ల ఖరీదైన వాచ్, దానికి తగ్గట్లుగా ఎలివేట్ అయ్యే షర్టు, అంతకుమించి ట్రాన్స్ పరెంట్ కళ్ళజోడు ఎన్టీఆర్ ని చర్మిష్మాటిక్ గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి.

దీంతో ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తారక్ అభిమానుల ఫోన్స్ లో వాల్ పేపర్ గా మారిపోయింది. దేవర మూవీ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే మూవీ గురించి తాజాగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.