Begin typing your search above and press return to search.

వార్ 2 లీక్స్.. ఆ భామతో మనోడి లుక్ వైరల్

ఈ సినిమాలో హృతిక్‌ రోషన్‌, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబోలో మాస్ సాంగ్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   15 April 2024 7:49 AM GMT
వార్ 2 లీక్స్.. ఆ భామతో మనోడి లుక్ వైరల్
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ వార్-2. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు తారక్. ఇటీవల ఈ మూవీ షూట్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ముంబై చేరుకున్నారు. ఆ సమయంలో తన హెయిర్ స్టైల్ ను కవర్ చేస్తూ టోపీ పెట్టుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.


ఈ సినిమాలో హృతిక్‌ రోషన్‌, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబోలో మాస్ సాంగ్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. హృతిక్‌, తారక్‌ సూపర్ స్టైలిష్‌ డ్యాన్సర్లని అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వరల్డ్‌ క్లాస్‌ మెస్మరైజింగ్‌ సాంగ్‌ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆ పాట నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సినీ వర్గాల్లో టాక్. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్‌ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌ తో రూపొందిస్తోంది.

ప్రస్తుతం యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ స్టూడియోలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పై కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు మేకర్స్. 10 రోజుల పాటు ఈ కీలక షెడ్యూల్ జరగనుంది. ఈ మూవీలోని పాత్ర కోసం ఎన్టీఆర్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిట్నెస్ ఎక్స్పెర్ట్ తో రెండు వారాల‌పాటు ట్రైనింగ్ సెష‌న్‌ లో పాల్గొన్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ముంబై షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ చేరుకుని దేవర షూటింగ్ లో పాల్గొనున్నారు తారక్.

తారక్ తో ఊర్వశి జిమ్ సెల్ఫీ!

మరోవైపు, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. జూనియర్ ఎన్టీఆర్ తో దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జిమ్ లో వీరిద్దరు దిగిన సెల్ఫీ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. పిక్ ను పోస్ట్ చేస్తూ ఊర్వశి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. తారక్ పై ప్రశంసల వర్షం కురిపించింది. "జూనియర్ ఎన్టీఆర్ మా ప్రియమైన నిజమైన గ్లోబల్ సూపర్‌ స్టార్.. క్రమశిక్షణ, నిజాయితీ, వినయంతో మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం. భవిష్యత్తులో మీతో కలిసి పని చేయడానికి రెడీ" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం ఊర్వశి రౌతేలా.. తెలుగులో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ NBK 109లో యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. దసరా కానుకగా ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే వార్-2లో ఊర్వశి కూడా నటిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి పిక్ అదిరిపోయిందని, థాంక్స్ మేడమ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.