Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తో వాళ్లకు ఇదే మొదటిసారి.. బ్లాస్టింగ్ పక్కా

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

By:  Tupaki Desk   |   25 March 2024 8:44 AM GMT
ఎన్టీఆర్ తో వాళ్లకు ఇదే మొదటిసారి.. బ్లాస్టింగ్ పక్కా
X

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. భీమ్ పాత్రలో తారక్ పెర్ఫార్మెన్స్ కి హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం కనెక్ట్ అయిపోయారు. అవకాశం ఉంటే భవిష్యత్తులో తారక్ తో మూవీ చేస్తానని ఓ హాలీవుడ్ డైరెక్టర్ ప్రకటించాడంటే భీమ్ గా తారక్ ఎంతగా ఆకట్టుకున్నాడో చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఏ పాత్ర ఎంచుకున్న దానికి 100 శాతం న్యాయం చేస్తాడు.

మంచి ఇంటెన్స్ తో పెర్ఫార్మ్ చేసే యాక్టర్ గా తారక్ తన సినిమాలతో పేరు తెచ్చుకున్నాడు. అందుకే బాలీవుడ్ దర్శకులు సైతం తారక్ తో సినిమాలు చేయడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు. ఇక లిస్టులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. రాబోయే సినిమాలకు వర్క్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి కూడా తారక్ తో మొదటి సినిమా కావడం విశేషం.

ట్యూన్స్ కాస్త పర్ఫెక్ట్ గా ఉన్నా చాలు తారక్ డ్యాన్స్ మూమెంట్స్ తో సాంగ్స్ ను మరో లెవెల్ కు తీసుకు వెళ్ళగలడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తారక్ పెర్ఫార్మెన్స్ కి తగ్గ మ్యూజిక్ ని అనిరుద్ అందిస్తే మాత్రం కచ్చితంగా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందనే మాట అభిమానుల నుంచి వినిపిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ హిందీలో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీలో నటించబోతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి బాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ప్రీతమ్ సంగీతం అందించబోతున్నాడు. కచ్చితంగా ఆయన నుంచి బెస్ట్ మ్యూజిక్ ని వస్తుందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. హృతిక్, తారక్ ఇద్దరు మంచి డాన్సర్స్. వీరిద్దరూ కలిసి డాన్స్ చేయాలంటే ప్రీతమ్ బెస్ట్ సాంగ్స్ ఇవ్వాల్సిందే.

ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ చేయబోయే సినిమాకి రవి బసృర్ సంగీతం అందించనున్నాడు. ఈ మూవీ మైథాలజీ బేస్డ్ కథతో ప్రశాంత్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే కచ్చితంగా రవి నుంచి బెస్ట్ స్కోర్ ని ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ తో తారక్ తో వర్క్ చేయడం మొదటి సారి. తారక్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని సంగీతం అందిస్తే మాత్రం బ్లాస్టింగ్ ఖాయం అనే మాట వినిపిస్తోంది. అలాగే ఈ మూడు చిత్రాల కాన్సెప్ట్ పరంగా కంప్లీట్ డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కుతున్నవే. ఇవి హిట్ అయితే తారక్ ఇమేజ్ కూడా మరింత పెరిగిపోతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.