Begin typing your search above and press return to search.

మ్యాన్ ఆఫ్ ది మాసెస్.. ఎలాంటి హిట్స్ కొడతారో?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 May 2024 6:45 AM GMT
మ్యాన్ ఆఫ్ ది మాసెస్.. ఎలాంటి హిట్స్ కొడతారో?
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీతో తారక్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. వరల్డ్ వైడ్ గా ఆయనకు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఎన్టీఆర్ కూడా ఆ సినిమాలో యాక్టింగ్ తో అదరగొట్టారు. రామరాజు పాత్రలో ఒదిగిపోయారు. ఫ్యాన్స్, ఆడియన్స్ తో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు.

ఇక ఆ సినిమా తర్వాత.. ఆయనకు ఫ్యాన్స్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ట్యాగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటి వరకు యంగ్ టైగర్ అని పిలుచుకున్న ఫ్యాన్స్.. RRR తర్వాత కొత్త టాగ్ తోనే పిలుస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎందరో సూపర్ స్టార్స్, మెగాస్టార్స్, పవర్‌ స్టార్స్‌ ఉన్నారు. కానీ తారక్ కు మాత్రమే ఉన్న ఏకైక బిరుదు మ్యాన్ ఆఫ్ మాసెస్‌.

ఈ బిరుదుకు ముఖ్య కారణం ఆయనకున్న మాస్‌ ఫాలోయింగే. ఇండియన్‌ మార్కెట్‌ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆయన ఎదిగిన తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కింద పడిన ప్రతిసారి సాలిడ్ బౌన్స్ బ్యాక్‌ తో తిరిగొచ్చిన తారక్.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే దేవర మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం నుంచి రీసెంట్ గా ఫియర్ సాంగ్ రిలీజ్ ఆయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.

అయితే దేవర మేకర్స్.. తమ మూవీ పోస్టర్స్ పై తారక్ పేరు ముందు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని వేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయనున్న మూవీ అప్డేట్ కూడా రీసెంట్ గా వచ్చింది. ఆగస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా పోస్టర్ పై కూడా తారక్ పేరు ముందు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అనే వేశారు. దీంతో తారక్.. ట్యాగ్ ఇంకా పూర్తిగా మారిపోయినట్లే.

ముందు A1 స్టార్ గా ఉన్న తారక్.. యంగ్ టైగర్ గా మారారు. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అనే యూనిక్ ట్యాగ్ సొంతం చేసుకున్నారు. ఇక తారక్.. బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ -2.. పోస్టర్ పై కూడా మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ యూనివర్సల్ ట్యాగ్ తో తారక్.. మున్ముందు ఎలాంటి హిట్స్ కొడతారో వేచి చూడాలి.