Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ హై వోల్టేజ్ లైనప్.. క్లిక్కయితే బీభత్సమే..

జూనియర్ ఎన్టీఆర్ కాస్త ఆలస్యం అయినా సరే పవర్ఫుల్ లైనప్ ను సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   27 March 2024 4:24 AM GMT
ఎన్టీఆర్ హై వోల్టేజ్ లైనప్.. క్లిక్కయితే బీభత్సమే..
X

జూనియర్ ఎన్టీఆర్ కాస్త ఆలస్యం అయినా సరే పవర్ఫుల్ లైనప్ ను సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. కథల విషయంలో ఏమాత్రం టెంప్ట్ కాకుండా పాన్ ఇండియా మార్కెట్ లో తన రేంజ్ ను పెంచుకునేలా జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కేవలం టాలీవుడ్ దర్శకులు మాత్రమే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇక అతని ప్రస్తుత లైనప్ వివరాల్లోకి వెళితే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకొని దేవర చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ పార్ట్ 1 ఈ ఏడాది దసరాకి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఈ కథని కొరటాల సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. జాన్వీ కపూర్ దేవర చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇది రిలీజ్ అయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకొని వచ్చే ఏడాది దేవర 2 చిత్రాన్ని తారక్ సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ యష్ రాజ్ ఫిలిమ్స్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ తారక్ చేయబోతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలో మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. వార్ 2 సినిమాలో తారక్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందనే మాట వినిపిస్తోంది.

వీటి తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాలని నిర్మించబోతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ 2 కంప్లీట్ చేసిన తరువాత తారక్ ప్రాజెక్ట్ పై కంప్లీట్ గా ఫోకస్ చేయనున్నాడంట. వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ తో అనుకున్న సినిమా పట్టాలు ఎక్కే ఛాన్స్ కనిపిస్తోంది.

నెక్స్ట్ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో తారక్ సోలోగా ఒక స్పై థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడంట. వార్ 2లో తారక్ చేసే క్యారెక్టర్ కి సంబందించిన బ్యాక్ స్టోరీతో ఈ మూవీ ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే కచ్చితంగా తారక్ నెక్స్ట్ ఇండియన్ సూపర్ స్టార్ గా మారిపోవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.

ఆర్ఆర్ఆర్ తోనే దేశ వ్యాప్తంగా తారక్ విపరీతమైన ఫ్యాన్స్ సొంతం చేసుకున్నాడు. ఈ ఐదు సినిమాలు అనుకున్నట్లు క్లిక్కయితే జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా పాన్ వరల్డ్ రేంజ్ కి ఎదిగిపోతాడు. వీటి తర్వాత వెట్రిమారన్ కూడా తారక్ తో సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం కథ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. తారక్ అయితే పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధమైతే గాని ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.