Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కు అక్కడ 100 కోట్ల ఛాన్స్!

మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ వీడియో కూడా దేవర కంటెంట్ ఏ రేంజ్ లో ఉండబోతోందనేది చూపించేశాయి.

By:  Tupaki Desk   |   11 March 2024 9:30 AM GMT
ఎన్టీఆర్ కు అక్కడ 100 కోట్ల ఛాన్స్!
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా దేవర ఉండబోతోందని ఇప్పటికే కొరటాల స్పష్టం చేశారు. మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ వీడియో కూడా దేవర కంటెంట్ ఏ రేంజ్ లో ఉండబోతోందనేది చూపించేశాయి.

కచ్చితంగా మాస్ ఆడియన్స్ కి దేవర మూవీ ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుందని స్పష్టం అవుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఏకంగా 300 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ దేవర మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. సైఫ్ అలీఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా కనిపిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ లో సక్సెస్ అందుకునే అవకాశం ఉందనే మాట ట్రేడ్ పండితుల నుంచి వినిపిస్తోంది. దీనికి కారణం గత కొన్నేళ్ల నుంచి సౌత్ ఇండియా మాస్ యాక్షన్ మూవీస్ ని బాలీవుడ్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడమే అని చెప్పాలి. అల్లు అర్జున్ పుష్ప సినిమాకి తెలుగులో అంతగా ఆదరణ రాకపోయిన బాలీవుడ్ లో కొన్ని కోట్లు కలెక్ట్ చేసింది.

పుష్ప సినిమా మానియా ఇప్పటికి నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఉంది. ఆ సినిమాలో మాస్, యాక్షన్ ఎలిమెంట్స్, క్యారెక్టరైజేషన్ బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. దేవర మూవీ కూడా అదే తరహాలో కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా వస్తోంది. దానికి తోడు ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్ కి తారక్ చేరువ అయిపోయాడు.

ఇప్పుడు వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ కారణాలు దేవర సినిమాకి బాలీవుడ్ లో భారీ హైప్ ని తీసుకొని వస్తాయని భావిస్తున్నారు. బాలీవుడ్ 100 కోట్ల కలెక్షన్స్ ని తారక్ దేవరతో అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దేవర మూవీ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయితే మాత్రం ప్రభాస్ తర్వాత బాలీవుడ్ మార్కెట్ ని శాశించే తెలుగు హీరోగా తారక్ అయ్యే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.