Begin typing your search above and press return to search.

భారీ ప్రాజెక్ట్స్​లో ఎన్టీఆర్​ గెస్ట్​ రోల్స్​.. నిజమెంత?

ఈ సినిమా క్లైమాక్స్​ తర్వాత వచ్చే పోస్ట్ క్రెడిట్ సీన్స్​లో​ హీరో యశ్​, జూనియర్ ఎన్టీఆర్​తో సర్ప్రైజ్ క్యామియోలు ఉంటాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   2 Oct 2023 12:38 PM GMT
భారీ ప్రాజెక్ట్స్​లో ఎన్టీఆర్​ గెస్ట్​ రోల్స్​.. నిజమెంత?
X

ఆర్​ఆర్​ఆర్​ లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్ భారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అన్నీ భారీ బడ్జెట్​ చిత్రాలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఆయన సల్మాన్ ఖాన్​ నటించిన లేటెస్ట్​ మూవీ టైగర్​ 3లో గెస్ట్​ రోల్​లో కనిపించనున్నారని రెండు ముడు రోజులుగా ప్రచారం గట్టిగా సాగుతోంది. అలాగే సలార్​ చిత్రంలోనూ కనిపిస్తారని అంటున్నారు. అయితే ఈ విషయాలపై కాస్త క్లారిటీ వచ్చింది.

వివరాళ్లోకి వెళితే... ఎన్టీఆర్​ ఇప్పటికే వార్ 2 చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారన్న విషయం తెలిసిందే. అఫీషియల్​గా అనౌన్స్ మెంట్​ కూడా వచ్చింది. వైఆర్​ఎఫ్ స్పై యూనివర్స్​లో భాగంగా ఈ సినిమా రూపొందుతోంది.

ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నారు. అయితే వైఆర్​ఎఫ్​ స్పై యూనివర్స్​ బ్యానర్​లో ఇప్పటికే సల్మాన్ హీరోగా టైగర్​ 3 అనే సినిమా కూడా తెరకెక్కింది. దీపావళికి రానుంది. ఇందులో షారుక్​-హృతిక్​-ఎన్టీఆర్​ అతిథి పాత్రలో కనిపిస్తారని ప్రచారం సాగింది.

కానీ ఇది ఇప్పుడు నిజం కాదని తెలిసింది. ఇందులో షారుక్​ మాత్రమే గెస్ట్​లో రోల్​లో ఓ 20 నిమిషాల పాటు కనిపించనున్నారట. ఎన్టీఆర్​ - హృతిక్​ లేరని సమాచారం అందింది. దీంతో పాటే కేజీయఫ్ ఫేమ్​ ప్రశాంత్​ తాజాగా డైరెక్ట్​ చేసిన సినిమా సలార్​.మరో మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా క్లైమాక్స్​ తర్వాత వచ్చే పోస్ట్ క్రెడిట్ సీన్స్​లో​ హీరో యశ్​, జూనియర్ ఎన్టీఆర్​తో సర్ప్రైజ్ క్యామియోలు ఉంటాయని అంటున్నారు.

మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ వార్తలను కొట్టి పారేయలేం అని బయట టాక్​ వినిపిస్తోంది. ఎందుకంటే ప్రశాంత్​.. తన యూనివర్స్​లో భాగంగా నెక్ట్స్​ ఎన్టీఆర్​తో ఓ సినిమా చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

కాగా, తారక్​ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్​తో ఫుల్ బిజీగా ఉన్నారు. నవంబర్​లో ఇది పూర్తవ్వగానే ఆ తర్వాత వార్​ 2 షూటింగ్​లో జాయిన్ అవుతారు. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. అనంతరం ప్రశాంత్​ నీల్​ సినిమాను సెట్స్​పైకి తీసుకెళ్లనున్నారు.