Begin typing your search above and press return to search.

హృతిక్ - ఎన్టీఆర్ 'నాటు నాటు'ను మించేలా?

ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబినేష‌న్ సంచ‌ల‌నాల‌కు తెర తీస్తుంద‌ని అభిమానులు న‌మ్ముతున్నారు.

By:  Tupaki Desk   |   12 April 2024 10:29 AM GMT
హృతిక్ - ఎన్టీఆర్ నాటు నాటును మించేలా?
X

ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబినేష‌న్ సంచ‌ల‌నాల‌కు తెర తీస్తుంద‌ని అభిమానులు న‌మ్ముతున్నారు. ట్రేడ్ లో ఈ అరుదైన క‌ల‌యిక‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. య‌ష్ రాజ్ ఫిలింస్ లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యాన‌ర్ ఇద్ద‌రు భిన్న ప‌రిశ్ర‌మ‌ల సూప‌ర్ స్టార్ల‌ను క‌లిపి సినిమా తీస్తుండ‌డం ఉత్కంఠ క‌లిగిస్తోంది.

గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో `వార్ 2` సినిమాని చిత్రీక‌రిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో ఎన్టీఆర్ ఈరోజు ముంబైలో అడుగుపెట్టాడు. వీలైనంత త్వరగా షూటింగ్ లో పాల్గొంటాడ‌ని తెలిసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ప్రత్యేక లుక్‌లో కనిపిస్తాడు. అతడి హెయిర్‌స్టైల్‌ను కవర్ చేస్తూ టోపీని ధరించిన ఫోటో ఒక‌టి ఇంత‌కుముందే రివీలైంది. అలాగే హృతిక్ కి ధీటుగా క‌నిపించేందుకు ఎన్టీఆర్ జిమ్‌లో తీవ్రంగా క‌స‌ర‌త్తులు చేసి షేపులు మార్చాడు. ఇప్పుడు మ‌రింత స్మార్ట్ గా మెలితిరిగిన కండ‌ల‌తో కనిపిస్తున్నాడు. మరోవైపు హృతిక్ - ఎన్టీఆర్‌లపై ఒక ఇంట్రెస్టింగ్ డ్యాన్స్ నంబ‌ర్‌ని ప్లాన్ చేసినట్లు తెలిసింది.

ద‌ర్శ‌కుడు అయాన్ ముఖర్జీ ఈ షెడ్యూల్ లో ఓ ప్రత్యేక పాటను చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేసార‌ని తెలిసింది. త్వరలో దీనిని చిత్రీకరించనున్నారు. హృతిక్ - ఎన్టీఆర్ ఇద్దరూ క్రేజీ డ్యాన్సర్లు కాబట్టి ఈ పాట సెన్సేషన్ సృష్టించ‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నారు. ఎన్టీఆర్- రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో `నాటు నాటు..` బెస్ట్ డ్యాన్సింగ్ సాంగ్‌గా రికార్డుల్లో నిలిచింది. ఇప్పుడు దానికి మించి హృతిక్- తార‌క్ కాంబినేష‌న్ పాట‌ను తెర‌కెక్కించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

నిజానికి `వార్‌`లో హృతిక్- టైగర్ ష్రాఫ్‌లపై ఒకే రకమైన పాటను చిత్రీకరించారు. అయితే ఈ సారి ఎన్టీఆర్ సీక్వెల్లో భాగమవ్వడంతో నెక్స్ట్ లెవెల్ లో ఈ జోడీ పాట‌ను తీర్చిదిద్ద‌నున్నార‌ని తెలిసింది. యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ పాట చిత్రీక‌ర‌ణ కోసం భారీగా ఖ‌ర్చు చేస్తోంది. సినిమా కోసం ఏకంగా 250 కోట్ల బ‌డ్జెట్ ని వెచ్చిస్తోంద‌ని స‌మాచారం. ఇద్ద‌రు బెస్ట్ డ్యాన్సింగ్ స్టార్స్ ఎన్టీఆర్ - హృతిక్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడటానికి అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు.