Begin typing your search above and press return to search.

తారక్ షర్ట్ లెస్.. ఇక హిస్టరీ రిపీటే

ట్రైలర్ లో తారక్ షర్ట్ లెస్ ఒక్క లుక్ తో సినిమా బ్లాక్ బస్టరే అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.

By:  Tupaki Desk   |   26 July 2025 11:24 AM IST
తారక్ షర్ట్ లెస్.. ఇక హిస్టరీ రిపీటే
X

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన వార్ 2 సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్, గ్రాండ్ విజువల్స్ తో ట్రైలర్ అదిరిపోయింది. ఇందులో తారక్, హృతిక్ మధ్య సీన్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా తారక్ పై సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.


సినిమాలో తారక్ సిక్స్ ప్యాక్ సీన్ ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు. ఒకరకంగా తారక్ షర్ట్ లెస్ సీన్ అరాచకం సృష్టించింది. బ్యాక్ డ్రాప్ లో కమ్ముకున్న మేఘాలు, మొహంపై గాయాలు, తారక్ ఫేస్ లో అగ్రెసివ్ ఎక్స్ ప్రెషన్స్ మామూలుగా లేవు. ఈ లుక్ నిన్నటి నుంచి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. నందమూరి అభిమానులకు ఇది ఐ ఫీస్ట్ లాగా అనిపించింది.


ట్రైలర్ లో తారక్ షర్ట్ లెస్ ఒక్క లుక్ తో సినిమా బ్లాక్ బస్టరే అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. గతంలో ఎన్టీఆర్ షర్ట్ తీసేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయని గుర్తు చేస్తున్నారు. గతంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన టెంపర్ సినిమాలో తారక్ తొలిసారి సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించారు. ఓ పాటలో తారక్ షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ తో కూల్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్ లో కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది.


ఆ తర్వాత 2018లో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సమేత వీర రాఘవ రెడ్డిలోనూ షర్ట్ లెస్ సీన్ ఉంది. ఈ సినిమా మొదట్లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ లో సిక్స్ ప్యాక్ లుక్ తో ఎన్టీఆర్ అరాచకం సృష్టించారు. ఫుల్ మాస్ లుక్ లో షర్ట్ లేకుండా విలన్లను కనికరం లేకుండా ఏరిపారేస్తారు. ఇక రాజమౌళి బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తారక్ స్పెషల్ గా మేకోవర్ అయ్యారు.


ఈ సినిమా కోసం బరువు పెరగడమే కాకుండా ఫిట్ గా కనిపించారు. ఇంట్రొడక్షన్ సీన్ లో పులితో వేటాడే సీన్ షర్ట్ లేకుండానే చిత్రీకరించారు. ఇది థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించింది. అయితే గతంలో తారక్ షర్ట్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా వార్ 2 లోనూ ఇదే తరహా సన్నివేశం ఉండడంతో ఇధి కూడా భారీ విజయం సాధించడం పక్కా అంటున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్.

కాగా, అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే నెల 14న రిలీజ్ కానుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నిటించింది. యశ్ రాజ్ ఫిల్మ్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.