ఎన్టీఆర్ రోల్...కాస్ట్యమ్ డిజైనర్ కే సవాల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'వార్ 2' తో బాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. తారక్ పాత్ర విషయం లో ఎన్నో సందేహాలున్నాయి. హీరో పాత్ర పోషిస్తున్న హృతిక్ రోషన్ రోల్ కి ధీటుగా ఉంటుందనే ప్రచారం తొలి నుంచి ఉంది.
By: Tupaki Desk | 10 Jun 2025 11:37 AM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ 'వార్ 2' తో బాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. తారక్ పాత్ర విషయం లో ఎన్నో సందేహాలున్నాయి. హీరో పాత్ర పోషిస్తున్న హృతిక్ రోషన్ రోల్ కి ధీటుగా ఉంటుందనే ప్రచారం తొలి నుంచి ఉంది. ఈ నేపథ్యంలో తారక్ పాజిటివ్ రోల్ లో కనిపిస్తాడా? నెగిటివ్ రోల్ లా కనిపిస్తాడా? అని ఎన్నో సందేహాలున్నాయి. రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు...యూనిట్ లీకులను బట్టి తారక్ బలమైన ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది.
మరి ఆ పాత్ర ప్రత్యేకత ఏంటి? అంటే చాలా ప్రత్యేకతలే ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అనతా ష్రాఫ్ అడజానియా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. తారక్ పాత్రలో చాలా కోణాలున్నాయన్నారు. ఆ పాత్రకు సంబంధించి చాలా లుక్స్ డిజైన్ చేసానన్నారు. ఆ పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా ఎన్నో విభిన్నమైన కాస్ట్యూమ్స్ డిజైన్ చేసాం. అదంత ఈజీగా జరగలేదు.
డిజైనింగ్ విషయంలో మాకు కూడా కొన్ని సందర్భాల్లో సవాల్ గా అనిపించిందన్నారు. 'తారక్ సెట్ లోకి వస్తే ఆ ఎనర్జీ అంతా అందరికీ వచ్చేస్తుంటుంది. తనలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉందనిపిస్తుంది. ఆయన్ని ఓ లక్ష్యంతో పనిచేసే మానవ యంత్రంలా చూపించే ప్రయత్నం చేసామ'న్నారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తారక్ సెట్లోకి అడుగు పెడతే అతడికి భాషతో సంబంధం ఉండదని తొలిసారి ప్రూవ్ అయింది.
సినిమా సెట్ ఏది అయినా? సెట్ లో ఉన్నంత సేపు తానెంత అంకిత భావంతో పనిచేస్తాడన్నది మరో సారి ప్రూవ్ అయింది. ఇక వెండి తెరపై తారక్ మెరుపులు ఎలా ఉంటాయో ఊహకే అందదు. ఇప్పటికే రిలీ జ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు సినిమా కాకపోయినా తారక్ ఎంట్రీ తో గ్రాండ్ గా టాలీవుడ్ లో రిలీజ్ అవుతుంది.