వార్ 2.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ డ్యూటీ ఎక్కేశారుగా..!
ఐతే ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ని జూలై 25న రిలీజ్ ప్లాన్ చేశారు. ఐతే ఈ సందర్భంగా మెల్బోర్న్ లోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ వార్ 2 పై తమ అభిమానాన్ని.. అంచనాలను చూపించారు.
By: Tupaki Desk | 24 July 2025 3:38 PM ISTమాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేసిన వార్ 2 ఆగష్టు 14న రిలీజ్ అవుతుంది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా ఉన్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ స్క్రీన్ షేరింగ్ సినిమాకే హైలెట్ అవ్వనుంది. ఐతే ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ని జూలై 25న రిలీజ్ ప్లాన్ చేశారు. ఐతే ఈ సందర్భంగా మెల్బోర్న్ లోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ వార్ 2 పై తమ అభిమానాన్ని.. అంచనాలను చూపించారు. మెల్బోర్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లైట్ స్మోక్ తో ఎన్టీఆర్ వార్ 2 అంటూ రాసి ట్రెండ్ సృష్టించారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలాంటివి చేయడం కామనే. తొలిసారి ఒక బాలీవుడ్ సినిమాలో ఎన్టీఆర్ నటించాదు. హృతిక్ రోషన్ తో కలిసి నటించాడు. ఈ సినిమాపై బాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో దానికి మించి సౌత్ లో ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో క్రేజ్ ఉంది. అక్కడ ఉంది ఎన్టీఆర్ కాబట్టి ఆ మాత్రం అంచనాలు ఉండటం కామనే. ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ల మధ్య యాక్షన్ సీన్స్ అదిరిపోతాయని టాక్.
వార్ 2 సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టకముందే సినిమా గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వరల్డ్ మొత్తం మాట్లాడుకునేలా చేస్తున్నారు. మెల్ బోర్న్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన ఈ పని తప్పకుండా ఎన్టీఆర్ దృష్టికి వెళ్లి ఉంటుంది. తనపై ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమ అభిమానానికి ఎన్టీఆర్ కూడా వారి పట్ల ఎంతో ఆప్యాయంగా ఉంటాడు.
ఇక వార్ 2 విషయానికి వస్తే ఈ సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. భారీ ధరకే వార్ 2 రైట్స్ నాగవంశీ కొన్నారని తెలుస్తుంది. విజయవాడలో వార్ 2 ఈవెంట్ ఉంటుందని.. భారీగా ఆ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నామని అన్నారు నాగ వంశీ. వార్ 2 సినిమా విషయంలో ఇప్పటికే తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఆమధ్య రిలీజైన టీజర్ అదిరిపోగా రేపు రాబోతున్న ట్రైలర్ మరింత అంచనాలు పెంచేస్తుందని అంటున్నారు. వార్ 2 సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది.
వార్ 2 గురించి వరల్డ్ మొత్తం మాట్లాడుకునేలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన ఈ ఫ్లైట్ స్మోక్ ఆర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
