డబ్బింగ్ ముగించిన ఎన్టీఆర్.. మరి పాట సంగతి ఏంటి?
'వార్ 2' సినిమా షూటింగ్ ఒక పాట మినహా మొత్తం పూర్తి అయింది. ఈ నెలలో ఆ పాట చిత్రీకరణ ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతూ వస్తున్నారు.
By: Tupaki Desk | 12 Jun 2025 10:46 AMఎన్టీఆర్ బాలీవుడ్‌లో 'వార్ 2' ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. ఆగస్టులో ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటించగా, ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించాడు. బాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎన్నో స్పై థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అదే తరహా స్పై థ్రిల్లర్ అని కాకుండా అరుదైన కాంబో మూవీ అంటూ అభిమానులు, సినీ ప్రేమికులు వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఈ స్పై థ్రిల్లర్‌లో నటించడంతో టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ క్రేజ్ పెరిగింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా హృతిక్ రోషన్ గాయం కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
'వార్ 2' సినిమా షూటింగ్ ఒక పాట మినహా మొత్తం పూర్తి అయింది. ఈ నెలలో ఆ పాట చిత్రీకరణ ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతూ వస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని, వాటిని వీఎఫ్‌ఎక్స్ లో అద్భుతంగా డిజైన్ చేశారని మేకర్స్ ద్వారా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పాడు. తెలుగుతో పాటు, హిందీలో కూడా ఎన్టీఆర్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. కన్నడ భాష కూడా ఎన్టీఆర్ అనర్ఘలంగా మాట్లాడుతాడు. కనుక వార్ 2 కన్నడ వర్షన్‌కి సైతం ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తానికి వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ డబ్బింగ్ పూర్తి చేశాడు. బ్యాలన్స్ ఉన్న పాట షూటింగ్‌లో హృతిక్ రోషన్‌తో పాటు ఎన్టీఆర్ రెండు నుంచి మూడు రోజుల పాటు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో యాక్షన్ సీన్స్ ఉంటాయి, అలాగే ఒక పాట కూడా ఉంటుంది. ఆ పాటలో ఇద్దరు డాన్స్‌తో అదరగొడతారని సమాచారం. ఇప్పుడు ఆ పాట మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఆ పాట షూటింగ్ ముందు హృతిక్ రోషన్‌కి గాయం అయింది. ఆ గాయం కాకుండా ఉండి ఉంటే ఇప్పటికే పాట చిత్రీకరణ పూర్తి చేయడంతో పాటు, ఆ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి ఉండేవారని బాలీవుడ్ మీడియా సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది.
యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ స్పై థ్రిల్లర్ లో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించింది. సినిమాలో ఆమె బికినీ షో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. టీజర్‌లో కియారా అద్వానీ టీజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. రెగ్యులర్ స్పై థ్రిల్లర్స్ మాదిరిగానే వార్ 2 ఉంటుందా అనే అనుమానంను టీజర్ కలిగింది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కొందరు వార్ 2 పై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ కూడా చేశారు. కానీ మేకర్స్ మాత్రం సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా స్పై థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులను మెప్పిస్తుందని హామీ ఇస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.