వార్ 2.. ఎన్టీఆర్ కూడా మాట ఇచ్చేశాడు
పాన్ ఇండియా క్రేజ్ ఉన్న బిగ్గెస్ట్ సినిమాల్లో వార్ 2 ఒకటి. యష్ రాజ్ ఫిలింస్ వార్ సిరీస్‌కి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి
By: Tupaki Desk | 13 April 2025 7:35 AMపాన్ ఇండియా క్రేజ్ ఉన్న బిగ్గెస్ట్ సినిమాల్లో వార్ 2 ఒకటి. యష్ రాజ్ ఫిలింస్ వార్ సిరీస్‌కి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ మరింత హైప్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటికే హృతిక్ పలు ఈవెంట్లలో వార్ 2 గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై తారక్ కూడా తన మాట ఇచ్చాడు.
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రం వార్ 2పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా గురించి ప్రస్తుతం ఎక్కువగా మాట్లాడనని, కానీ అది అద్భుతంగా వచ్చిందని, అనుకున్న విధంగానే ఆగస్టు 14న థియేటర్లలోకి వస్తుందని స్పష్టంగా చెప్పారు. అంటే ఇప్పటివరకు వచ్చిన వాయిదా గాసిప్స్‌కి తారక్ మాటతో పూర్తిగా ఫుల్ స్టాప్ పడింది.
ఈమధ్య హృతిక్ రోషన్ వరుస ఇంటర్వ్యూలలో కూడా ఇదే విషయాన్ని పదేపదే నొక్కి చెప్పారు. వార్ 2 రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని, జూన్ జులై మధ్య రెగ్యులర్ ప్రమోషన్లను ప్రారంభిస్తామని హింట్ ఇచ్చారు. ఈ సినిమా వాళ్లిద్దరి కెమిస్ట్రీతోనే కాదు.. భారీ యాక్షన్ మేకింగ్, విభిన్న షేడ్స్ ఉన్న కథతో కూడి ఉండబోతోందనే ఆసక్తి కలిగిస్తోంది.
తారక్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర చేస్తున్నారనే టాక్ ఉన్నప్పటికీ.. ఆయన పాత్ర పవర్ ఫుల్ గా ఉండనుందన్న భావన ఫ్యాన్స్ లో ఉంది. హృతిక్ మాటల్లోనే ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు తారక్ కూడా సినిమా బాగా వచ్చిందని, ఆగస్టు 14నే వస్తుందని చెప్పడంతో, ఈ మూవీపై క్రేజ్ రెట్టింపయ్యింది.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో, ప్రమోషన్స్ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా వేరే సినిమాల మాదిరిగా ఇందులోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేయాలని, పూర్తిగా డిఫరెంట్ షేడ్స్ చూపించాలని కష్టపడ్డారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే హృతిక్, ఎన్టీఆర్‌లు కలిసి చేస్తున్న సీన్లపై టెక్నికల్ టాక్ వినిపిస్తోంది. యాష్ రాజ్ ఫిలింస్ సంస్థ స్పై యూనివర్స్‌లో మరో మైలురాయిగా నిలవబోతున్న వార్ 2 సినిమాపై ఆసక్తి మరింత పెరగడం ఖాయం. ఆగస్టు 14న విడుదల కావడం ఖాయం అన్న తారక్ మాట.. ఫ్యాన్స్‌కి మరింత బలాన్ని ఇచ్చింది.