'వార్ 2' తెలుగు హక్కులు.. యువనిర్మాత క్లారిటీ
ఇంతలోనే నాగవంశీ సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండిస్తూ ఒక నోట్ ని ఇన్ స్టాలో రిలీజ్ చేసాడు.
By: Tupaki Desk | 1 May 2025 10:00 PM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ 2'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బ్రహ్మాస్త్ర ఫేం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యష్‌రాజ్ ఫిలింస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఇలాంటి క్రేజీ మూవీని తెలుగులో రిలీజ్ చేయాలని పలువురు పంపిణీదారులు కలలు కంటున్నారు. కానీ రేసులో సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత నాగవంశీ ముందు వరుసలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటివరకూ వార్ 2 తెలుగు రైట్స్ డీల్ ముగియలేదు. ఇంకా ఓపెన్ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే నాగవంశీ తారక్ కి అత్యంత సన్నిహితుడు. ఇంతకుముందు నాగవంశీకే చెందిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో అరవింద సమేత లాంటి హిట్ చిత్రంలో తారక్ నటించాడు. అలాగే ఎన్టీఆర్ నటించిన 'దేవర'ను నాగవంశీ స్వయంగా పంపిణీ చేయడమే గాక, ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఎంతో హార్డ్ వర్క్ చేసాడు. అతడి డెడికేషన్ నచ్చిన తారక్ ఇప్పుడు యష్ రాజ్ ఫిలింస్ కి నాగవంశీని పరిచయం చేసాడని కథనాలొస్తున్నాయి. 'వార్ 2' రైట్స్ ని సితార అధినేత దక్కించుకునేందుకు వందశాతం ఛాన్సుంది. కానీ ఇంకా డీల్ పూర్తి కాలేదు.
ఇంతలోనే నాగవంశీ సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండిస్తూ ఒక నోట్ ని ఇన్ స్టాలో రిలీజ్ చేసాడు. వార్ 2 తెలుగు రిలీజ్ హక్కులకు సంబంధించిన డీల్ ఇంకా ముగియలేదని నాగవంశీ వెల్లడించారు. ఒకవేళ హక్కులు దక్కించుకుంటే, సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధికారికంగా ప్రకటిస్తుందని తెలిపారు. ఆగస్ట్ 14న వార్ 2 విడుదల కానుంది. అలాగే హారిక అండ్ హాసిని బ్యానర్ లో యంగ్ టైగర్ ఓ సినిమా చేసేందుకు అంగీకరించారని కథనాలొచ్చాయి. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తారని కూడా టాక్ వినిపించింది. అయితే దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
