హృతిక్ ఇంటికి ఎన్టీఆర్ ట్రక్కు.. మ్యాటర్ ను చాలా దూరం తీసుకెళ్లిన తారక్
జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన వార్ 2 ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ కానుంది.
By: Tupaki Desk | 5 Aug 2025 10:50 PM ISTజూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన వార్ 2 ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ లో జోర పెంచారు. దీని కోసం స్వయంహా ఎన్టీఆర్, హృతిక్ రంగంలోకి దిగారు. రీసెంట్ గా ట్విట్టర్ లో ఈ ఇధ్దరు స్టార్లు ట్వీట్లతో యుద్దం చేశారు. ఇద్దరూ తమతమ హ్యాష్ ట్యాగ్ ల కోసం సరదాగా పోటీపడ్డారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తాజాగా మూవీటీమ్ ప్రమోషన్స్ లో ఇంకాస్త జోరు పెంచింది. ఈసారి తారక్ వైల్డ్ లుక్ పోస్టర్ తో ఉన్న బిల్ బోర్డ్ ట్రక్కును హృతిక్ ఇంటికి పంపింది. తన బాల్ కనీలో నిల్చొని పైనుంచి హృతిక్ ట్రక్కును చూస్తున్నట్లు కనిపిస్తున్న ఫొటోలు ఆయనే స్వయంగా ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ ట్రక్కుపై ఎన్టీఆర్ మాస్ లుక్ పోస్టర్ తోపాటు ఈ యుద్ధంలో మిమ్మల్ని మీరు గెలువలేరు అని రాసింది. ఇక బాటం లైన్ లో # NTR vs Hritik అనే హాష్ ట్యాగ్ ఉంది.
దీనికి రిప్లైగా హృతిక్ ఓకే తారక్. నా ఇంటికి బిల్ బోర్డు పంపించి ఈ వ్యవహారాన్ని చాలా దూరం తీసుకెళ్లావు. ఆల్ రైట్, ఛాలెంజ్ స్వీకరిస్తున్నా. కానీ గుర్తుంచుకో, ఇది నీకు నువ్వుగా మొదలుపెట్టిందే అని. అంటూ హృతిక్ తన పోస్టుకు క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ట్వీట్లతోనే ప్రమోషన్స్ వేలే లెవెల్ లో చేస్తున్నారంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
కాగా, ఈ ఇద్దరూ నిన్ననే # NTR vs Hritik, #Hritik vs NTR హాష్ ట్యాగ్ ల కోసం ఫన్నీ వార్ చేసుకున్నారు. తాజాగా బిల్ బోర్డుతో ఇంకో లెవెల్ కు ప్రమోషన్స్ ను తీసుకెళ్లారు. చూడాలి మరి. రేపు రేపు సినిమాను ఇంకా ఎన్ని కొత్త విధాలుగా ప్రమోట్ చేస్తారో.
అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాగా ఇది రూపొందింది. స్పై థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రంపై అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వాణీ హీరోయిన్ గా నటించింది. యష్ రాజ్ ఫిల్మ్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించింది.
